TOP BRASS MEETING HELD ON BRAHMOTSAVAM SECURITY _ అన్ని విభాగాల సమన్వయంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి - అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి
TIRUMALA 29 AUGUST 2024: Top brass authorities from both the TTD and Police held a review meeting on Brahmotsavam security arrangements.
The meeting was held at Annamaiah Bhavan in the presence of the Additional EO of TTD Sri Ch Venkaiah Chowdhary by CVSO Sri Sreedhar and District SP Sri Subbarayudu in Tirumala on Thursday evening.
Addressing the TTD and police cops, other officials, the Additional EO called upon all the officers of the concerned departments to work as a team towards the successful conduct of the most prestigious annual mega religious festival of Srivari Brahmotsavams which is scheduled from October 4 to 12.
He also said many officers have a vast experience of having witnessed and worked in multiple Brahmotsavams in their service.
Keeping in view their past experience, everyone has to give their full strength and commitment towards a smooth and hassle-free conduct of the fete.
Earlier the TTD CVSO presented a PowerPoint Presentation with every detail of the galleries of the four Mada streets, Entry and Exit points, second filling, challenges in controlling mob and preventive measures, parking places, rope parties and related issues.
Later Tirupati SP also narrated the security and safety measures to be ensured to the scores of pilgrims visiting Tirumala during the annual fete.
Top cops from TTD Vigilance and Security, district police, TTD officers were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అన్ని విభాగాల సమన్వయంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి - అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి
తిరుమల, 2024 ఆగస్టు 29: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో విజయవంతం చేయాలని టీటీడీ అదనపు శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సమక్షంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల భద్రత ఏర్పాట్లపై సివిఎస్‌వో శ్రీ శ్రీధర్, జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు సమీక్ష నిర్వహించారు.
అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు టీటీడీ, పోలీసు, సంబంధిత విభాగాల అధికారులంతా సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.
ఇక్కడ ఉన్న చాలామంది అధికారులకు అనేక బ్రహ్మోత్సవాలను చూసిన, పనిచేసిన అపారమైన అనుభవం ఉందన్నారు. వారి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు.
ముందుగా టీటీడీ సీవీఎస్‌వో నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ఎదురయ్యే సవాళ్లు, అధిగమించేందుకు తీసుకోవలసిన చర్యలు, పార్కింగ్ స్థలాలు, రోప్ పార్టీలు, సంబంధిత సమస్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను అందించారు.
అనంతరం తిరుపతి ఎస్పీ వార్షిక ఉత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు చేయనున్న భద్రతా చర్యలను వివరించారు.
ఈ సమావేశంలో టీటీడీ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.