TOP PRIORITY TO COMMON PILGRIMS_ సామాన్య భ‌క్తుల‌కు గ‌దుల కేటాయింపున‌కు పెద్ద‌పీట – వ‌స‌తి క‌ల్ప‌న విభాగం డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి కోనేటి పార్వ‌తి, శ్రీ బాలాజి

Tirumala, 16 October 2018: TTD has given top priority in the allotment of rooms and dormitory space to common devotees during Srivari Salakatla and Navaratri Brahmotsavams, said Deputy EOs of the Reception wing of TTD Smt Koneti Parvati and Sri Balaji.

Addressing the reporters at the Media centering Rambagicha Rest house here, they said advance reservation of rooms have been reduced to 50% during the Brahmotsavams to facilitate the current bookings for pilgrims who land at Tirumala. TTD has also stopped honoring recommendation letters during the festival period so that common devotees were not put to inconveniences.

They said since the Brahmotsavams and the Peritasi month had synchronized together there was a great demand and huge rush of devotees from Tamil Nadu. To enable allotment of rooms for the pilgrims, the TTD had set up special teams to get rooms vacated early which had brought 400 rooms for additional allotments in this festival.

In 2015 the Reception -1 had gathered a revenue of Rs. 68.38 lakhs this year annual Brahmotsavams as against Rs.61.44 lakhs in 2015.

In 2015 navaratri Brahmotsavams TTD earned Rs.71.46 lakhs and the current Navaratri Brahmotsavam for six days the collection was Rs.54.91 lakhs.

In the reception -2 wing Rs.1.01 crore was collected in the current year’s navaratri brahmotsavams for six days as against Rs.1.39 crores during 2015, they said.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

సామాన్య భ‌క్తుల‌కు గ‌దుల కేటాయింపున‌కు పెద్ద‌పీట – వ‌స‌తి క‌ల్ప‌న విభాగం డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి కోనేటి పార్వ‌తి, శ్రీ బాలాజి

అక్టోబ‌రు 16, తిరుమల 2018: శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలలో సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేసి గ‌దులు కేటాయించామ‌ని టిటిడి వ‌స‌తి క‌ల్ప‌న విభాగం డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి కోనేటి పార్వ‌తి, శ్రీ బాలాజి తెలియ‌జేశారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో మంగ‌ళ‌వారం వారు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డెప్యూటీ ఈవోలు మాట్లాడుతూ బ్ర‌హ్మోత్స‌వాల్లో అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ 50 శాతం త‌గ్గించామ‌ని, సిఫార్సు లేఖ‌ల‌ను స్వీక‌రించ‌లేద‌ని తెలిపారు. పెర‌టాసి మాసం రావ‌డంతో ఈసారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అధిక సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేశార‌ని, ఇందుకు అనుగుణంగా త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని అన్నారు. భ‌క్తులు త్వ‌ర‌గా గ‌దులు ఖాళీ చేసి ఇత‌ర భ‌క్తుల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేశామ‌ని, ఇందుకోసం ప్ర‌త్యేక బృందాన్ని ఏర్పాటుచేశామ‌ని చెప్పారు. ఇలా చేయ‌డం వ‌ల్ల రోజుకు అద‌నంగా 400 గ‌దులు అందుబాటులోకి వ‌చ్చాయ‌న్నారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో విధులు నిర్వ‌హించేందుకు విచ్చేసిన టిటిడి డెప్యుటేష‌న్ అధికారుల‌కు, సిబ్బందికి, పోలీసుల‌కు, ఆర్‌టిసి, అగ్నిమాప‌క‌, అట‌వీ విభాగాలకు, మీడియా ప్ర‌తినిధుల‌కు గ‌దులు కేటాయించామ‌ని వెల్ల‌డించారు. పిఏసి-1, పిఏసి-2లో క‌లిపి 16 హాళ్ల‌లో లాక‌ర్ సౌక‌ర్యం ఉంద‌ని, ఒక్కో హాల్లో 500 మంది భ‌క్తులు వ‌స‌తి పొందొచ్చ‌ని తెలిపారు.

వ‌స‌తి క‌ల్ప‌న విభాగం -1 ప‌రిధిలో గ‌దుల అద్దె ద్వారా 2015లో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో రూ.61.44 ల‌క్ష‌లు ఆదాయం రాగా, ఈ వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాల్లో రూ.68.38 లక్ష‌ల ఆదాయం ల‌భించింద‌ని తెలిపారు. 2015లో న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో రూ.71.16 ల‌క్ష‌లు ఆదాయం రాగా, ఈ న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆరు రోజుల్లో రూ.54.91 లక్ష‌ల ఆదాయం ల‌భించింద‌న్నారు. వ‌స‌తి క‌ల్ప‌న విభాగం -2 ప‌రిధిలో గ‌దుల అద్దె ద్వారా 2015లో న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో రూ.1.39 కోట్ల ఆదాయం రాగా, ఈ న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆరు రోజుల్లో రూ.1.01 కోట్ల‌ ఆదాయం ల‌భించింద‌న్నారు.

ఈ మీడియా స‌మావేశంలో వ‌స‌తి క‌ల్ప‌న విభాగం ఏఈవో శ్రీ ఎవిఎల్‌.నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.