CULTURAL FIESTA DURING BRAHMOTSAVAMS_ సూర్యప్రభ వాహ‌న‌సేవ‌లో ఆక‌ట్టుకున్న కోలాటం, డ్రమ్స్, చెక్క భజన

Tirumala, 16 October 2018: The exquisite display of Kolata by 35 local boys of Tirumala and a Blind TTD employee singing Bhakti sangeet in front of the Surya Prabha vahanam stood as highlights of the cultural events on Tuesday during Srivari Navaratri Brahmotsavams.

Under the guidance of the Hindu Dharma Prachara Parishad, cultural troupes from all over state presented Kolatas, sporting mythological characters etc. on the mada streets, enthralling the devotees sitting in the galleries. The retired unit officer of the TTD, Sri Govindaswamy supervised the Kolata display by 35 schoolboys hailing from Balajinagar of Tirumala.

A blind woman Smt Naga Padmaja, who works as a junior assistant at the Ruia Hospital in Tirupati also, presented bhakti sangeet in folk format. As she sang praise of Lord Malayappa Swamy local boys danced and displayed Kolata, which caught the attention of everyone.

Sri Govindswamy says that his team with Drums, dappus and Talas and dancers have been performing since the last 13 years during Brahmotsavams and other events at Tirumala.

Another highlight of the cultural events at the Vahana seva this morning was the special Vesha pradarshana by 42 artists from Sri Radha Manohar Bhajan Mandali led by Sri Haribabu of Rajamahendravaram in East Godavari district. Artists donned spectacular forms of different deities – Sri Krishna, and Pandavas, Saptha Rishis etc.

Eleven artists from Paryana Shiripali Marumata Sangham of Udupi of Karnataka presented drum. A team of 36 dancers from Hubli belonging to Parimala Bhajan mandali led by Sri Krishna Bondivada presented dance, Bhajana, kolatas and dance programs.

A 15-member team of the Gautami Bhajan mandal of Visakhapatnam led by Sri S L Prasada Rao presented Kolatas. Artists from Srimadanandhra Nilaya Vasa Bhajana mandali led by Sri Rajamohan presented Radhakrishna dance. Sri Bhuavaneswari Kolata Bhajan mandali led by Shobha Rani and 38 artists from Sri Sri Keshava Troupe of Chittoor presented Kolata dances.

Another team of 19 Flute players from same district led by Sri L Venkataramana performed group bhajan on the mada streets. From West Godavari district the 83 member team of the Sri Varasiddhi Vinayaka and AmbikaTanaya groups presented huge Nasik drum performances. The 15 members of Srimannarayana Annamaiah bhajan mandali led by Sri Harini of East Godavari district displayed their skills in Kolata dances. The artists of Vengamamba bhajan mandali of Railway Kodur in Kadapa, Sri Harirama bhajan mandali of Tirumala, Chandana Dance Academy of Visakhapatnam also presented Kolatas and drum beats on Mada streets.

The 30-member team of Sri Venkateswara bhajan mandali of Vijayawada presented chekka bhajanalu.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

సూర్యప్రభ వాహ‌న‌సేవ‌లో ఆక‌ట్టుకున్న కోలాటం, డ్రమ్స్, చెక్క భజన

తిరుమల, 2018 అక్టోబరు 16: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహ‌న‌సేవ‌లో క‌ళాబృందాలు కోలాటాలు, డ్రమ్స్, చెక్కభజన, పిల్ల‌న‌గ్రోవి భ‌జ‌న భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. కర్నాటక రాష్ట్రం ఉడిపికి చెందిన పర్యాన శిరిపలి మరుమాత సంఘం బృందం ఉడిపి వాద్యంను ప్రదర్శించారు. ఈ బృందానికి శ్రీ బెల్కాలె ఛందే బలగ నేతృత్వంలో వచ్చిన ఈ బృందంలో 11 మంది కళాకారులు ఉన్నారు. విశాఖ జిల్లాకు చెందిన గౌతమి భజన మండలికి శ్రీ ఎస్.ఎల్. ప్రసాదరావు నేతృత్వం వహించారు. ఈ బృందంలో 15 మంది కళాకారులు కోలాటం ప్రదర్శించారు. తిరుపతికి చెందిన శ్రీమదానంద నిలయ వాస భన మండలి కళాకారులు రాధాకృష్ణుల ప్రదర్శన నిర్వహించారు. ఈ బృందానికి శ్రీ రాజమోహన్ నేతృత్వం వహించారు.

రాజమండ్రికి చెందిన శ్రీభువనేశ్వరి కోలాట భజన మండలికి పోపి రాణి నేతృత్వం వహించగా, చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీ శివకేశవ ట్రూప్ కు శ్రీనివాస నాయకత్వం వహించగా, ఈ బృందం నుండి వచ్చిన 38 కళాకారులు కోలాటం ప్రదర్శించారు. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం ఎంజీ కోటకు చెందిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస పిల్లన గ్రోవి ట్రూప్ కు శ్రీ ఎల్. వెంకటరమణ నేతృత్వం వహించగా, ఈ బృందం నుండి వచ్చిన 19 కళాకారులు పిల్లన గ్రోవి భజనలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి శ్రీ వరసిద్ది వినాయక, అంబిక తనయ గ్రూప్ లు వచ్చాయి. ఈ రెండు గ్రూప్ లలో 83 మంది కళాకారులు ఉండగా, నాశిక్ డ్రమ్స్ కళను ప్రదర్శించారు. తూర్పు గోదావరి జిల్లా నుండి వచ్చిన శ్రీమన్నారాయణ అన్నమయ్య భజ‌న మండలికి శ్రీ హారిణి నేతృత్వం వహించగా, ఈ బృందం నుండి వచ్చిన 15 మంది కళాకారులు కోలాటం నిర్వహించారు. కడప జిల్లా రైల్వే కోడూరు నుండి వచ్చిన వెంగమాంబ భజన మండలి, గుంటూరు జిల్లా శ్రీ ఉమామహేశ్వర కోలాట బృందం, తిరుమలకు చెందిన శ్రీ హరిరామ భజనమండలి, విశాఖ జిల్లాకు చెందిన చందన డ్యాన్స్ అకాడమీ నుంచి కళాబృందాలు కోటాలంను ప్రదర్శించారు. కర్నాటక రాష్ట్రం హూబ్లీ నుండి వచ్చిన పరిమళ భజన మండలికి శ్రీ కృష్ణారావు బొండివాడ్ నేతృత్వం వహించగా, ఈ బృందం నుండి వచ్చిన 36 కళాకారులు డ్యాన్స్, భజన, కోలాటం నిర్వహించారు. విజయవాడకు చెందిన శ్రీ వేంకటేశ్వర బృందం నుంచి 30 మంది కళాకారులు చెక్క భజన చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.