TRADERS TO SELL GOODS ONLY FOR PRICES AS DECIDED BY TTD _ టీటీడీ నిర్ణయించిన ధరలకే భక్తులకు విక్రయించాలి

WILL FACE LEGAL CONSEQUENCES ON VIOLATION

Tirumala, 07 July 2024: TTD on Saturday directed traders to sell the products like water bottles, other items to the pilgrims only at the prices prescribed by the TTD.

Upon the directions of TTD EO Sri J Syamala Rao, in the supervision of TTD JEO Sri Veerabrahmam, a team of Estate wing officials of TTD have conducted an inspection at Srivari Mettu in the guise of pilgrims where they notified malpractices by a few traders.

They purchased a glass water bottle in shop no.3 for ₹50 and on returning the empty bottle, the shopkeeper gave them back only ₹20 instead of ₹30 indicating that goods are being sold at higher prices to the devotees.

The report submitted by the team of officials also notified that besides selling the glass water bottles at higher rates, he is also selling lower quality plastic material water bottles against the norms and the shopkeeper has also not displayed any price list of the items.

The same person was already warned once earlier for the same mischief and was fined ₹. 25,000. They warned him that if he is caught for one more time, his shop will be ceased and he will have to forfeit the Earnest Money Deposit (EMD) and Security Deposit(SD) also.

The officers also said the licence of the traders whomsoever cheating the devotees, will also be cancelled if the traders are found violating the TTD tender norms.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ నిర్ణయించిన ధరలకే భక్తులకు విక్రయించాలి

నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కఠినమైన చర్యలు

తిరుమల, 06 జూలై 2024: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరలకే వస్తువులను దుకాణదారులు విక్రయించాలని, అధిక ధరలు విక్రయిస్తే చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఒక ప్రకటనలో తెలియజేసింది.

టీటీడీ ఈవో ఆదేశాల మేరకు, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం పర్యవేక్షణలో శనివారం టీటీడీ ఉద్యోగులు భక్తుల వలె శ్రీవారి మెట్టు వద్ద ఉన్న షాప్ నంబర్-3లో గాజు సీసా నీటి బాటిల్ రూ.50/- కొనుగోలు చేశారు. అనంతరం కాళీ గ్లాస్ బాటల్ తిరిగి షాపు యజమానికి ఇవ్వగా రూ.20/- రూపాయలు వెనుకకు ఇచ్చారు. వాస్తవంగా రూ.30/- తిరిగి ఇవ్వాలి. కావున వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

అదేవిధంగా వీరు కొనుగోలు చేసిన దుకాణ మందు తక్కువ నాణ్యత కలిగిన ప్లాస్టిక్ బాటిల్స్ కూడా నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నట్లు గమనించారు.

గతంలో ఇదే షాపు యజమాని టిటిడి నిబంధనలకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలకు ఇదివరకే  షాప్ నెంబర్ -3 శ్రీ వినోద్ కుమార్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసి, ₹. 25,000 జరిమానా విధించి హెచ్చరించటం జరిగింది.

అయినా ఆ షాపు యజమాని తన ధోరణి మార్చుకోలేదని, ధరల పట్టిక ప్రదర్శించడం లేదని పై అధికారులకు నివేదిక అందజేశారు.

ఈ నేపథ్యంలో, సదరు వ్యక్తి తన దుకాణంలో మరోసారి టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయించిన ఎడల అతని దుకాణాన్ని సీజ్ చేయడం జరుగుతుందని, Earnest Money Deposit(EMD) మరియు Security Deposit(SD)లు కూడా జప్తు కాబడుతుందని సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా దుకాణదారులు వస్తువులను భక్తులకు అధిక ధరలకు విక్రయించి వారిని మోసం చేసిన ఎడల, టీటీడీ టెండర్ నిబంధనలు అతిక్రమించిన ఎడల, అట్టి దుకాణదారుల లైసెన్స్ రద్దు చేయబడుతుందని హెచ్చరించారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది