TRAIMASIKA METLOTSAVAM FROM JULY 14-16_ శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

Tirupati, 12 July 2018: All arrangements were made to observe Tri-monthly fete, Metlotsavam, from July 14-16 by Dasa Sahitya Project of TTD.

This will commence from TTD Chowltry behind Tirupati Railway Station on Saturday. The Shobha Yatra will be performed from Sri Govinda Raja Swamy temple to reach III Chowltry. On July 16, the Alipiri Metlotsavam will commence by 4am.

Bhajanaparas from AP, TS, Karnataka, Tamilnadu and Maharastra take part in this fete.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2018 జూలై 12: టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 14 నుండి 16వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల శ్రీగోవిందరాజస్వామి మూడో సత్ర ప్రాంగణాన్ని సిద్ధం చేశారు.

ఈ సందర్భంగా జూలై 14, 15వ తేదీల్లో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు చెందిన భజన మండళ్ల సభ్యులు సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు, ధార్మిక సందేశం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 14న సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి మూడవ సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం అధికార ప్రముఖులు సందేశమిస్తారు. జూలై 16న ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.

”శ్రీవేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం, శ్రీవేంకటేశ్వరునికి సరితూగే పరదైవం ఈ బ్రహ్మాండంనందు లేదు” అని శ్రీ వ్యాసమహర్షులు కొనియాడారు. ప్రభాత సమయంలో ఈ కొండను అధిరోహించిన వారికి వేయిసార్లు కాశీ-రామేశ్వర యాత్ర చేసిన ఫలం దక్కుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఎందరో మహర్షులు, రాజర్షులు, శ్రీ పురందరదాసులు, శ్రీవ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపడుతోంది. ఇలా కాలినడకన వెళ్లి సప్తగిరీశుని దర్శిస్తే వారికి సకల అరిష్టాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.