TRY SAMPLE LADDUS WITH BEST QUALITY GHEE-EO _ నాణ్యమైన నెయ్యితో శ్రీవారి లడ్డు ప్రసాదాల శాంపిల్స్ తయారు చేయండి: పోటు కార్మికులతో టీటీడీ ఈవో

TIRUMALA, 21 JUNE 2024: Prepare sample laddus using best quality ghee, besan flour and cardamom, TTD EO Sri J Syamala Rao told Potu Workers.

During the review meeting held at Gokulam rest house on Friday in Tirumala along with JEO Sri Veerabrahmam and CVSO Sri Narasimha Kishore on Laddu preparation, the EO asked the potu workers the issues associated with Laddu preparation and reasons on the alleged diminishing quality.

The potu workers put forth before the EO the various issues which included the need to enhance the quality of Besan Flour, Ghee and Cardamom that are being utilized in the preparation of laddus besides enhancing the man power as the work load has enormously increased.

The concerned officials informed the EO that all the materials are being procured floating tenders and the lowest bidder will be allotted the bid to supply the ingredients.

After listening to their woes and suggestions, the EO asked them to try preparation of sample laddus using highest quality ghee and other ingredients.

Temple DyEO Sri Lokanatham, AEO Potu Sri Srinivasulu, retired AEOs Sri Srinivasan, Sri Vasanta Rao and others were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నాణ్యమైన నెయ్యితో శ్రీవారి లడ్డు ప్రసాదాల శాంపిల్స్ తయారు చేయండి: పోటు కార్మికులతో టీటీడీ ఈవో

తిరుమల, 21 జూన్ 2024: నాణ్యమైన నెయ్యి, శెనగపిండి, యాలకులు ఉపయోగించి మరింత రుచికరంగా లడ్డూల శాంపిల్స్ తయారు చేసి నాణ్యతను పరిశీలించాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు పోటు కార్మికులను ఆదేశించారు.

తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో శుక్రవారం లడ్డూ తయారీపై జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్‌వో శ్రీ నరసింహకిషోర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యతా లోపం పై వస్తున్న విమర్శలకు గల కారణాలను ఈవో పోటు కార్మికులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పోటు కార్మికులు లడ్డూల తయారీలో వినియోగిస్తున్న శెనగపిండి, నెయ్యి, యాలకుల నాణ్యతను పెంపొందించాలని అభిప్రాయ పడ్డారు.

అంతే కాకుండా పని భారం పెరిగిపోవడంతో అదనపు సిబ్బందిని తదనుగుణంగా నియమించాలని వారు ఈఓకు విన్నవించారు.

అన్ని ముడి సరుకులను టెండర్ల ద్వారా సేకరిస్తున్నామని, తక్కువ ధరకు తెలిపిన వారి వద్దనుండి కొనుగోలు చేస్తామని సంబంధిత అధికారులు ఈఓకు వివరించారు.

అధికారులు, పోటు కార్మికుల సలహాలు, సూచనలు విన్న తరువాత, ఈవో మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన నెయ్యి మరియు ఇతర పదార్థాలను ఉపయోగించి రుచికరమైన లడ్డూల నమూనాలను (శాంపిల్స్)తయారు చేసి రుచి, నాణ్యతను పరిశీలించాలని కోరారు.

ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈవో (పోటు) శ్రీ శ్రీనివాసులు, విశ్రాంత ఏఈవోలు శ్రీ శ్రీనివాసన్, శ్రీ వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే త్రికా ప్రకటన