TTD BOARD MEETING EXCEPTS_ టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

Tirumala, 28 August 2018: The TTD Board on Tuesday resolved the following decisions under the Chairmanship of Sri P Sudhakar Yadav.

Some excerpts

➢ To sanction Rs.150 cr towards the construction of Sri Venkateswara Swamy temple in Tullur mandal, Venkatapalem at Amaravati.

➢ To sanction Rs.79cr towards the construction of PAC near Govardhan Chowltries in Tirumala.

➢ To sanction Rs.37.05cr towards the development of Kalyana mandapams across the state of AP.

➢ Maintenance of new seva sadan buildings, PAC 3, Vakuladevi Rest House to be given to FMS at Rs.19.50cr for a period of 3 years.

➢ To hand over the PAC in Vontimitta at Kadapa to AP Tourism

➢ To extend the licence of Ramakrsihana Mission Ashram in Tirupati for next three years from September 1, 2018 to August 31, 2021.

➢ To enhance the wages of 65 drivers, 15 fitters from Rs.15,000 to Rs.24,500 and 28 cleaners from Rs.12,000 to 18,000 who are working on outsourcing in TTD transport as per the revised PRC in 2015

➢ A five member constituted with FACAO, Estates Officer, Catering Officer, Health Officer and Tahsildar as co-ordinator to review the rates of eatables, beverages in Fast Food centres in Tirumala.

➢ To distribute 2200 spiritual publications of TTD to 142 Libraries in AP.

➢ A sub committee constituted to supervise first phase works of Goshala coming up Palamaneru.

➢ To handover TTD Kalyana mandapam located at Jangamaheswarapuram of Gurajala in Guntur district to the local Sri Venkateswara Swamy temple Trust on free of cost on lease basis.


ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

ఆగస్టు 28, తిరుమల 2018: టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి. ముందుగా ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమానికి సహకరించిన భక్తులు, మీడియాకు ఛైర్మన్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.

– అమరావతిలోని తుళ్లూరు మండలం వెంకటపాళెం వద్ద రూ.150 కోట్లతో శ్రీ వేంకటేశ్వర దివ్యక్షేత్రం నిర్మాణం.

– శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని గోవర్ధన సత్రం సమీపంలో నూతన యాత్రికుల వసతి సముదాయం నిర్మాణానికి రూ.79 కోట్లు మంజూరు.

– సనాతన ధర్మప్రచారంతోపాటు శ్రీ వేంకటేశ్వరతత్వాన్ని మరింత విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా 2,200 టిటిడి ఆధ్యాత్మిక ప్రచురణలను ఆంధ్రప్రదేశ్‌లోని 142 గ్రంథాలయాలకు ఉచితంగా సరఫరా.

– 2015 సవరించిన పిఆర్‌సి ప్రకారం టిటిడి రవాణా విభాగంలో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న 65 మంది డ్రైవర్లు, 15 మంది ఫిట్టర్లకు నెలవారీ వేతనం రూ.15 వేల నుండి రూ.24,500/-లకు, 28 మంది క్లీనర్లకు నెలవారీ వేతనం రూ.12 వేల నుండి రూ.18 వేలకు పెంచడం జరిగింది.

– తిరుమలలోని ఫాస్ట్‌ఫుడ్‌, టి, టిఫిన్‌ సెంటర్లలో ఆహారపదార్థాల ధరలను సమీక్షించేందుకు ఐదుగురు టిటిడి అధికారులతో కమిటీని(ఎస్టేట్‌ అధికారి అధ్యక్షుడిగా, క్యాటరింగ్‌ అధికారి, ఆరోగ్యాధికారి, ముఖ్య గణాంకాధికారి సభ్యులుగా, తహసీల్దార్‌ సమన్వయకర్తగా) ఏర్పాటు చేయడమైనది. ఈ కమిటీ నివేదిక రూపొందించి బోర్డుకు సమర్పిస్తుంది.

– తిరుమలలో నూతనంగా నిర్మించిన శ్రీవారి సేవాసదన్‌-1, 2 భవనాలు, వకుళాదేవి విశ్రాంతిగృహం, పిఏసి-3 కలిపి 3 సంవత్సరాలకు గాను ఎఫ్‌ఎంఎస్‌ నిర్వహణ కోసం రూ.19.50 కోట్లతో టెండర్లు ఖరారు.

– కడప జిల్లా ఒంటిమిట్టలోని యాత్రికుల వసతి సముదాయం భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖకు అప్పగింత.

– తిరుపతిలో టిటిడి భవనంలో గల రామకృష్ణ మిషన్‌ ఆశ్రమం లైసెన్సు కాలపరిమితిని 01-09-2018 నుండి 31-08-2021 వరకు 3 సంవత్సరాలు పొడిగింపునకు ఆమోదం.

– ఆంధ్రప్రదేశ్‌లోని టిటిడి కల్యాణమండపాల్లో అభివృద్ధి, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు రూ.37.05 కోట్లు మంజూరుకు ఆమోదం.

– టిటిడి ఆధ్వర్యంలో పలమనేరులో ఏర్పాటుచేస్తున్న గోశాల మొదటి దశ నిర్మాణపనులకు గాను సబ్‌ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.

– గుంటూరు జిల్లా గురజాల మండలం జంగమహేశ్వరపురం వద్దగల టిటిడి కల్యాణమండపాన్ని స్థానిక శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థాన అభివృద్ధి కమిటీ ట్రస్టుకు ఉచితంగా లీజుకు కేటాయింపునకు ఆమోదం.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ మన్‌మోహన్‌ సింగ్‌, కమిషనర్‌ డా|| ఎం.పద్మ, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి సుధానారాయణమూర్తి, శ్రీ ఇ.పెద్దిరెడ్డి, శ్రీరుద్రరాజు పద్మరాజు, శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, శ్రీ జిఎస్‌ఎస్‌.శివాజి, శ్రీపొట్లూరి రమేష్‌బాబు, శ్రీ సండ్ర వెంకటవీరయ్య, శ్రీ డొక్కా జగన్నాథం, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీరాఘవేంద్రరావు, శ్రీ అశోక్‌రెడ్డి, శ్రీ ఎన్‌.శ్రీకృష్ణ, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.