BRAHMOTSAVAMS POSTERS AND BOOKLETS RELEASED_ శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, బుక్‌లెట్లు ఆవిష్కరణ
TIRUMALA, 28 August 2018: The wall posters and programme booklets pertaining to annual and Navarathri Brahmotsavams were released on Tuesday by TTD Trust Board Chairman Sri Putta Sudhakar Yadav along with TTD EO Sri Anil Kumar Singhal and other board members at Annamaiah Bhavan in Tirumala.
This year of the twin brahmotsavams annual Brahmotsavams are scheduled from September 13 to 21 while Navarathri Brahmotsavams from October 10 to 18.
Principal Secretary Endowments Sri Manmohan Singh, Commissioner Dr M Padma, board members Sri Rudraaju Padmaraju, Sri Meda Ramakrishna Reddy, Sri Challa Ramachandra Reddy, Sri Sandra Venkata Veeraiah, Sri Sivaji, Sri Dokka Jagannath, Smt Sudha Narayana Murthy, Sri Peddireddi, Sri P Ramesh Babu, special invitees Dr Raghavendra Rao, Sri Ashok Reddy, Sri Krishna, JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, బుక్‌లెట్లు ఆవిష్కరణ
ఆగస్టు 28, తిరుమల 2018: తిరుమల శ్రీవారి వార్షిక, నవరాత్రి బహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రికలు, బుక్‌లెట్లను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్, కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, ఇతర బోర్డు సభ్యులతో కలిసి తిరుమలలోని ఆన్నమయ్య భవనంలో మంగళవారం నాడు ఆవిష్కరించారు. టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ ఏడాది అధికమాసం ఉన్న కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా అక్టోబరు 14న గరుడవాహనం, అక్టోబరు 15న పుష్పక విమానం, అక్టోబరు 17న స్వర్ణరథం, అక్టోబరు 18న చక్రస్నానం జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ మన్‌మోహన్ సింగ్, కమిషనర్ డా|| ఎం.పద్మ, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి సుధానారాయణమూర్తి, శ్రీ ఇ.పెద్దిరెడ్డి, శ్రీరుద్రరాజు పద్మరాజు, శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, శ్రీ జిఎస్‌ఎస్.శివాజి, శ్రీపొట్లూరి రమేష్‌బాబు, శ్రీ సండ్ర వెంకటవీరయ్య, శ్రీ డొక్కా జగన్నాథం, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీరాఘవేంద్రరావు, శ్రీ అశోక్‌రెడ్డి, శ్రీ ఎన్.శ్రీకృష్ణ, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ పాల్గొన్నారు.
వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
(9గం|| నుండి 11 గం|| వరకు) (8 గం|| నుండి 10 గం||ల వరకు)
13-09-2018 సా|| ధ్వజారోహణం (4 నుంచి 4.45 గం||ల వరకు)(మకర లగ్నం), పెద్దశేషవాహనం.
14-09-2018 చిన్నశేష వాహనం హంస వాహనం
15-09-2018 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
16-09-2018 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
17-09-2018 మోహినీ అవతారం గరుడ వాహనం(రా.7 నుండి 12 వరకు)
18-09-2018 హనుమంత వాహనం స్వర్ణరథం (సా.4 నుండి 6 వరకు), గజవాహనం.
19-09-2018 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
20-09-2018 రథోత్సవం(ఉ.7.30 గంటలకు) అశ్వ వాహనం
21-09-2018 చక్రస్నానం ధ్వజావరోహణం
(ఉ.7.30 నుండి 10 వరకు) (రా|| 7 నుంచి 9 వరకు).
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.