TTD CANCELS ALL PRIVILEGE DARSHANS ON DEC 31 AND JAN 1_ డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు

Tirumala, 30 December 2018: In view of anticipated pilgrim rush for New Year Day, TTD has suspense with all sorts of privilege darshans on December 31 and January 1.

On the eve of New Year Day and on January 1, TTD has cancelled all the arjitha sevas and also the privilege darshans to aged, physically challenged, parents with infants, donors etc. Even the VIP break darshanam is also limited to protocol VIPs only on these two days.

All the arjitha sevas will resume from January 2 onwards.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు

తిరుమల, 2018 డిసెంబర్‌ 30: తిరుమల శ్రీవారి దర్శనార్థం డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో విశేషంగా విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది. బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు పరిమితం చేయడం జరిగింది.

ఈ రెండు రోజుల్లో దివ్యదర్శనం టోకెన్ల జారీ ఉండదు. వృద్ధులు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, దాతలకు ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది. జనవరి 2వ తేదీ నుండి యథావిధిగా ఆర్జితసేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు కొనసాగుతాయి. భక్తులు ఈ విషయాలను గమనించి సహకరించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.