CHAIRMAN COMPLIMENTS TTD VIGILANCE AND POLICE_ తిరుమలలో చిన్నారి కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులకు టిటిడి ఛైర్మన్‌ అభినందనలు

Tirumala, 30 Dec. 18: TTD Trust Board Chairman Sri P Sudhakar Yadav on Sunday complimented TTD Vigilance and Tirupati Urban police for their initiative in tracing the kidnapped child and reuniting with parents.

It may be mentioned here that 16 year old baby boy was kidnapped in Tirumala on Friday while he was sleeping with his parents in Tirumala.

Following the footage given by TTD vigilance sleuths, Tirupati Urban SP Sri Anburajan traced out the kidnapper and sent his team to Nanded in Maharashtra and caught hold of the kidnapper along with the child.

The Chairman congratulated the team spirit of the cops.

On other hand Sri Gopinath Jetti, CVSO of TTD also complimented the team work by TTD vigilance and Tirupati cops in reuniting the child with his parents.

He cautioned the parents who are coming with infants and children to be attentive in highly infested places like Tirumala.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

తిరుమలలో చిన్నారి కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులకు టిటిడి ఛైర్మన్‌ అభినందనలు

తిరుమల, 2018 డిసెంబర్‌ 30: తిరుమలలో డిసెంబరు 28న శుక్రవారంనాడు కిడ్నాప్‌ అయిన 16 నెలల వయసు గల బాలుడు వీరేష్‌ ఆచూకీని గుర్తించిన పోలీసులకు టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఆదివారం ఒక ప్రకటనలో అభినందనలు తెలియజేశారు. మహారాష్ట్రలోని లాథూర్‌లో ఈ చిన్నారిని గుర్తించారు.

కిడ్నాప్‌ కేసును ఛేదించిన తిరుపతి అర్బన్‌ ఎస్‌పి శ్రీ అన్బురాజన్‌కు, టిటిడి సివిఎస్‌వో శ్రీగోపినాథ్‌జెట్టికి ఇతర అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. విస్తృత ప్రచారం కల్పించి ఈ కిడ్నాప్‌ కేసును ఛేదించడంలో సహకరించిన మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.