TTD CANCELS CERTAIN SEVAS AND SPECIAL DARSHANS DURING ANNUAL FEST _ శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో వివిధ ప్రత్యేక ద్రర్శనాలు రద్దు
Tirumala,22 August 2024: TTD has cancelled certain Arjita Sevas and Darshans during the forthcoming Srivari annual Brahmotsavam scheduled from October 4-12 with Ankurarpanam on October 3.
TTD has cancelled all special Darshan including Parents with infants, Senior citizens and Physically challenged darshans besides VIP Break Darshans(only Protocol VIPs are allowed on reporting Self) to facilitate larger number of pilgrims with comfortable and satisfactory Darshans during the nine-day Brahmotsavams.
TTD has appealed to devotees to note the changes and cooperate with the management for the smooth and successful conduct of the annual Brahmotsavams.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో వివిధ ప్రత్యేక ద్రర్శనాలు రద్దు
తిరుమల, 2024 ఆగస్టు 22: తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు టిటిడి రద్దు చేసింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా విచ్చేస్తారు. కావున వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది.
ఇందులో భాగంగా అక్టోబరు 3 (అంకురార్పణం) నుండి 12వ తేదీ (చక్రస్నానం) వరకు ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, సం|| లోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు టిటిడి రద్దు చేసింది. విఐపి బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టిటిడి పరిమితం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరుతున్నది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.