TTD CHAIRMAN, EO EXTEND DEEPAVALI GREETINGS _ దీపావళి ప్రతి ఇంట్లో ఆనందం సంతోషపు వెలుగులు నింపాలి – టీటీడీ చైర్మన్ , ఈవో దీపావళి శుభాకాంక్షలు

TIRUMALA, 11 NOVEMBER 2023: TTD Trust Board Chairman Sri Bhumana Karunakara Reddy and EO Sri AV Dharma Reddy, extended Deepavali Greetings to the devotees of Sri Venkateswara Swamy spread across the globe, employees and Srivari Sevaks.

They wished with the benign blessings of Srivaru let the darkness in all our lives be absolved in the brightness of the festival of lights.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

దీపావళి ప్రతి ఇంట్లో ఆనందం సంతోషపు వెలుగులు నింపాలి – టీటీడీ చైర్మన్ , ఈవో దీపావళి శుభాకాంక్షలు

తిరుమల, 2023 నవంబర్ 11: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల జీవితాలలో దీపావళి వెలుగు రేఖలు ప్రసరించాలని, ప్రతి ఇంట్లో ఆనందం, సంతోషపు వెలుగులు వెల్లివిరియాలని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ఆకాంక్షించారు. శనివారం ఒక ప్రకటనలో వారు శ్రీవారి భక్తులకు, ఉద్యోగులకు, శ్రీవారి సేవకులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీవారి అనుగ్రహంతో రాష్ట్రం మరియు దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని వారు కోరారు.

నవంబర్ 12న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం :

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది