TTD CHAIRMAN, EO INSPECTS THE ARRANGEMENTS IN GALLERIES _ గ్యాలరీల్లో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్, ఈవో

DEVOTEES GIVES THUMBS UP TO TTD SERVICES

TIRUMALA, 19 OCTOBER 2023: TTD Chairman Sri Bhumana Karunakara Reddy along with the TTD EO Sri AV Dharma Reddy inspected the galleries and interacted with the pilgrim devotees about the distribution of food and other amenities being provided to them in connection with Garuda Seva on Thursday.

The devotees also expressed immense happiness at the volume of services provided by TTD providing them Annaprasadam and water facilities at regular intervals.

SERVICES OF SEVAKS LAUDED

TTD Chairman and EO lauded the impeccable services of the Srivari Sevaks who have been rendering services to the devotees waiting in the four Mada Street galleries since the early hours with dedication and devotion. Nearly 2,500 Srivari Sevaks were pressed in service for food packing, food distribution in galleries and distribution of water to the Health department. 

OFFICERS APPRECIATED

They also appreciated the vigil by senior officers who were drafted to monitor the services in all the four Mada streets under the direct supervision of TTD JEO Sri Veerabrahmam with the assistance by FACAO Sri Balaji, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao and PRO Dr T Ravi in the Mada streets. 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

గ్యాలరీల్లో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్, ఈవో

– టీటీడీ ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేసిన భక్తులు

తిరుమల, 2023 అక్టోబ‌రు 19: తిరుమలలో గురువారం గరుడసేవ సందర్భంగా భక్తులకు అందజేస్తున్న అన్నప్రసాదాలు, ఇతర సౌకర్యాలను టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి పరిశీలించారు. గ్యాలరీల్లోని భక్తులతో ముచ్చటించి వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదాలు, తాగునీరు నిరంతరాయంగా అందజేస్తున్నందుకు భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

శ్రీవారి సేవకులకు ప్రశంసలు

నాలుగు మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు తెల్లవారుజాము నుంచి అంకితభావంతో, భక్తిశ్రద్ధలతో సేవలందిస్తున్న శ్రీవారి సేవకుల సేవలను టీటీడీ ఛైర్మన్, ఈవో కొనియాడారు. దాదాపు 2500 మంది శ్రీవారి సేవకులు అన్నప్రసాదాల ప్యాకింగ్, గ్యాలరీలలో అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేయడాన్ని అభినందించారు.

టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం ప్రత్యక్ష పర్యవేక్షణలో నాలుగు మాడ వీధుల్లో భక్తుల సౌకర్యాలను పరిశీలిస్తున్న ఎఫ్‌ఏసీఏవో శ్రీ బాలాజీ, ఎస్‌వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్‌కుమార్, సీఈ నాగేశ్వరరావు, పీఆర్వో డా.టి.రవి తదితర సీనియర్ అధికారులను అభినందించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.