TTD CHAIRMAN INSPECTS BIRRD_ బర్డ్ ఆసుపత్రిలో టిటిడి ఛైర్మన్ తనిఖీలు
Tirupati, 13 Jul. 19: TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Saturday inspected the Balaji Institute of Research Rehabilitation and Surgery for the Disabled (BIRRD) hospital in Tirupati.
He inspected all wards and interacted with the patients over the medication and other amenities being provided to them.
Later speaking to media he said, he had lengthy discussions with the doctors who brought him several issues to his notice to further improve patient care in the hospital. “Our motto is to take this hospital to the global standards. Once the board is formed, we will improve the facilities to provide better Medicare to the patients here”, he maintained.
Chandragiri MLA Sri C Bhaskar Reddy, In-charge Director Dr Venka Reddy and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
బర్డ్ ఆసుపత్రిలో టిటిడి ఛైర్మన్ తనిఖీలు
తిరుపతి, 2019 జూలై 13: టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో నడుస్తున్న బర్డ్ ఆసుపత్రిలో శనివారం సాయంత్రం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తనిఖీలు చేపట్టారు. ఐసియు, వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసుపత్రికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకతోపాటు ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహరాష్ట్ర నుండి ఎక్కువగా రోగులు వస్తున్నారని వివరించారు. రోగులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. సుమారు రూ.4 కోట్లతో 40 గదులు అదనంగా నిర్మిస్తామని, ఆపరేషన్ థియేటర్లలో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి తెస్తామని, టిటిడి బోర్డు సమావేశంలో చర్చించి ఈ మేరకు నిధులు విడుదల చేస్తామని తెలియజేశారు. బర్డ్ ఆసుపత్రిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామన్నారు. ఇటీవల శ్రీవారి సేవా సదన్ పై అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందపడి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీవారి సేవకుడి కుటుంబానికి ఆర్థికసహాయం అందించి ఆదుకుంటామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సామాన్య భక్తులకు సంతృప్తికరంగా స్వామివారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని చెప్పారు.
ఈ తనిఖీల్లో తుడ ఛైర్మన్, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బర్డ్ ఇన్‌చార్జి డైరెక్టర్ డా.. వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.