KAVACHA PRATISTA AT GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా కవచ ప్రతిష్ట‌

Tirupati, 13 Jul. 19: As a part of the ongoing three day annual Jyesthabhishekam at Sri Govindaraja Swamy temple in Tirupati, Kavacha Pratista was performed with religious fervour on Saturday.

Earlier during the deities were rendered snapana tirumanjanam.

Later in the evening, the deities of Sri Govindaraja Swamy flanked by Sridevi and Bhudevi were taken on a celestial procession along four mada streets.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా కవచ ప్రతిష్ట‌

జూలై 13, తిరుపతి, 2019: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు శ‌నివారం కవచప్రతిష్ట‌ వైభవంగా జరిగింది. ప్రతి ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి ఆలయంలో జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు శ‌త‌క‌ల‌శ‌స్న‌ప‌నం, మ‌హాశాంతి హోమం చేప‌ట్టారు. ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ల‌తో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కవచప్రతిష్ట‌ చేశారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్‌, ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఇవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ జ్ఞానప్రకాష్‌, శ్రీ శ్రీ‌హ‌రి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ ప్ర‌శాంత్‌, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.