TTD CHAIRMAN INSPECTS ELECTRICAL BUSES _ ఎలక్ట్రిక్ బస్సు ను పరిశీలించిన టీటీడీ చైర్మన్

Tirumala, 7 Nov. 20: TTD Chairman Sri YV Subba Reddy on Saturday inspected the eco-friendly Electrical RTC bus operation at Tirumala on the second day of its trial run.

The RTC officials explained the advantage and convenience of operating the electric buses on the ghat roads to the Chairman.

Speaking to reporters the TTD Chairman said that the Bangalore based M/s Veer Vahan Udyog Pvt ltd was engaged by TTD to convert the diesel buses into electric buses. As part of the trial runs, three trips of new electric buses are being operated every day between Tirupati and Tirumala on the ghat roads. For one electrical charge, the buses would run for nearly 170 kms. The Chairman also travelled on the electrical bus from his camp office in Tirumala up to the Annamaiah Bhavan.

RTC Regional Manager Sri Chengal Reddy, CMEs Sri Narasimhulu, Sri Srinivas and Sri Chandrasekhar were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎలక్ట్రిక్ బస్సు ను పరిశీలించిన  టీటీడీ చైర్మన్                                                       
 
7 నవంబరు 2020: తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత రెండు రోజులుగా ట్రైల్  రన్   నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ ఆర్.టి.సి. బస్సును శనివారం 
టీటీడీ చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తిరుమలలో పరిశీలించారు. ఎలక్ట్రిక్ బస్సు పని తీరును ఆర్.టి.సి. అధికారులు ఛైర్మన్ కు వివరించారు. 
 
ఈ సందర్బంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ  బెంగళూరుకు చెందిన వీర వాహన ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రస్తుతం ఉన్న డీజీల్ బస్సు లను ఎలక్ట్రిక్ బస్సు లుగా  మార్పు చేస్తునట్లు తెలిపారు. ఇందులో భాగంగా గత రెండు రోజులుగా ఎలక్ట్రిక్ బస్సు ను రోజుకు మూడు ట్రిప్ లు తిరుపతి తిరుమల ఘాట్ రోడ్డులో నడిపి పరీక్షించినట్లు  తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సు కు ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 170 కిమీ ప్రయాణిస్తుందని వివరించారు.    
 
అనంతరం తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన ఎలక్ట్రిక్ బస్సు లో అన్నమయ్య భవన్ వరకు ప్రయాణించి  బస్సు పని తీరును పరిశీలించారు.
 
ఈ కార్యక్రమంలో ఆర్.టి.సి.ఆర్.ఏం.శ్రీ చెంగల్ రెడ్డి, డెప్యూటీ సి.ఎం.ఈ.లు శ్రీ నరసింహులు,శ్రీ శ్రీనివాస్, శ్రీ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.        –
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది