TTD CHAIRMAN INTERACTS WITH DEVOTEES _ గ్యాలరీల్లో భక్తులతో ముచ్చటించిన టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు
Tirumala, 17 September 2026: TTD Chairman Sri B.R. Naidu interacted with devotees in the galleries during the Mutyapu Pandiri Vahana seva on Thursday evening.
He personally sought feedback on TTD facilities including darshan, annaprasadam, accommodation, laddu prasadam, and Vahana Seva viewing arrangements.
Devotees expressed satisfaction with the Brahmotsavam arrangements.
The Chairman assured that their suggestions would be considered to enhance services further.
Later, Chairman also observed the cultural performances by various art troupes and appreciated the artists.
TTD Board Members Sri Naresh Kumar, Smt. Janakidevi, Smt. Rangasri, and others participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
గ్యాలరీల్లో భక్తులతో ముచ్చటించిన టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు
టీటీడీ సౌకర్యాలు, బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై భక్తులతో ముఖాముఖి
తిరుమల, 2026 సెప్టెంబర్ 17: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం రాత్రి జరిగిన ముత్యపుపందిరి వాహనసేవను వీక్షించేందుకు గ్యాలరీలకు వచ్చిన భక్తులతో టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు ముచ్చటించారు.
ఈ సందర్భంగా భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లపై ఆయన స్వయంగా భక్తులను అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, వసతి, లడ్డూ ప్రసాదం, వాహనసేవల వీక్షణకు చేసిన ఏర్పాట్లు తదితర అంశాలపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వారి సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఛైర్మన్ తెలిపారు.
కళాబృందాల ప్రదర్శనలు పరిశీలించిన ఛైర్మన్
అనంతరం వివిధ కళాబృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, పాలకమండలి సభ్యులు పరిశీలించారు. అద్భుతమైన కళా ప్రదర్శనలు అందించిన కళాకారులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నరేష్ కుమార్, శ్రీమతి టి. జానకీదేవి, శ్రీమతి ఎ. రంగశ్రీ తదితరులు పాల్గొన్నారు.









