TTD CHAIRMAN INVITES TN CM FOR BHOOMIPOOJA OF CHENNAI SRI PADMAVATHI TEMPLE ON APRIL 9 _ ఏప్రిల్ 9న శ్రీ ప‌ద్మావ‌తి ఆల‌య భూమిపూజ‌కు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రికి ఆహ్వానం : టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

Chennai, 15 Mar. 20: TTD Chairman Sri YV Subba Reddy along with TTD EO Sri Anil Kumar Singhal called on Chief Minister of Tamil Nadu Sri E Palaniswamy in his office on Sunday and invited him for the Ground Breaking Ceremony for the construction of Sri Padmavathi temple at Chennai on April 9.

Speaking to Media later the Chairman said that several other pending issues concerning with TTD have also been discussed with the honourable CM of Tamilnadu, who responded favourably to TTD requests.

He said TTD has requested and identified 11 acres of land on the OMR -ICR roads for developing a Sri Venkateswara Divya Kshetram, Kalyana mandapam and an Information Centre.

TTD had also sought TN CM to hand over the land at the earliest for commencing the process of construction of temple as desired by the devotees of Tamil Nadu.

Similarly TTD chairman said on the request of building an Srivari temple at the Ulundueupetai, a decision will be taken after discussing with AP Chief Minister.

He said land for the temple was already donated by the local MLA and TTD board member Sri Kumara Guru and local devotees are also keen to raise a donation of Rs.10 crore towards the construction of temple and TTD would also contribute favourably towards the project.

The TTD chairman also appealed to the honourable chief minister to grant tax exemption for all TTD construction activities in Tamil Nadu, as TTD is a religious and charitable institution conducting all dharmic activities as per the AP Endowment Act.

DHANVANTARI YAGAM

Seeking a healthy way of humanity with divine intervention, TTD will be performing Sri Srinivasa Shantyotsava Sahita Dhanvantari Maha Yagam at Dharmagiri Vedapathashala in Tirumala from March 26-28.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 9న శ్రీ ప‌ద్మావ‌తి ఆల‌య భూమిపూజ‌కు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రికి ఆహ్వానం : టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి
 
తిరుప‌తి, 2020 మార్చి 15: చెన్నై న‌గ‌రంలో ఏప్రిల్ 9న నిర్వ‌హించ‌నున్న శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌య నిర్మాణం భూమిపూజ కార్య‌క్ర‌మానికి తమిళనాడు ముఖ్యమంత్రి గౌ. శ్రీ ఇ.పళనిస్వామిని ఆహ్వానించిన‌ట్టు టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. టిటిడి ఛైర్మ‌న్‌తో పాటు ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు స‌భ్యులు శ్రీ కుమార‌గురు, శ్రీ శేఖ‌ర్‌రెడ్డి ఇత‌ర అధికారులు ఆదివారం చెన్నైలో గౌ. ముఖ్య‌మంత్రిని క‌లిశారు.
 
ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ టిటిడికి సంబంధించిన ప‌లు అంశాల‌ను గౌ.ముఖ్య‌మంత్రితో చ‌ర్చించామ‌ని, అన్నింటికీ సానుకూలంగా స్పందించార‌ని తెలిపారు. చెన్నైలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి దివ్య‌క్షేత్రం, క‌ల్యాణ‌మండ‌పం, స‌మాచార కేంద్రం నిర్మాణానికి సుమారు 11 ఎక‌రాల స్థ‌లాన్ని ఓఎంఆర్ రోడ్డు, ఇసిఆర్ రోడ్డు మ‌ధ్య‌లో గుర్తించామ‌ని, ఈ స్థ‌లాన్ని టిటిడికి అప్ప‌గించాల‌ని కోరామ‌ని చెప్పారు. ఈ స్థ‌లాన్ని అప్ప‌గిస్తే త‌మిళ‌నాడు భ‌క్తుల కోసం త్వ‌ర‌లో ఆల‌య నిర్మాణ ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తామ‌న్నారు. అదేవిధంగా, ఉలందూరుపేట‌లో శ్రీ‌వారి ఆల‌యం నిర్మించాల‌ని గౌ.ముఖ్య‌మంత్రి కోరార‌ని, మ‌న రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యుల‌తో చ‌ర్చించి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఉలందూరుపేట‌ ఎమ్మెల్యే, టిటిడి బోర్డు స‌భ్యుడు శ్రీ కుమార‌గురు ఇందుకోసం స్థ‌లాన్ని విరాళంగా ఇచ్చార‌ని, ఆల‌య నిర్మాణానికి స్థానికుల నుండి సుమారు రూ.10 కోట్లు విరాళాలుగా సేక‌రించేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని వివ‌రించారు. టిటిడి కూడా కొంత మొత్తాన్ని కేటాయించి అక్క‌డ ఆల‌య నిర్మాణం చేప‌డ‌తామ‌న్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం దేవాదాయ చ‌ట్టం ప్ర‌కారం టిటిడి కార్య‌కలాపాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని, ఈ క్ర‌మంలో త‌మిళ‌నాడులోని టిటిడి సంస్థ‌ల‌కు ప‌న్నుల నుండి మిన‌హాయింపు ఇవ్వాల‌ని గౌ. ముఖ్య‌మంత్రిని కోరామ‌న్నారు. విశ్వ‌మాన‌వ శ్రేయ‌స్సు కోసం శ్రీ‌వారి ఆశీస్సులు కోరుతూ మార్చి 26, 27, 28వ తేదీల్లో తిరుమ‌ల‌లో శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం నిర్వ‌హిస్తామ‌ని ఛైర్మ‌న్‌ తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.