TTD CHAIRMAN MEETS TS CM _ తెలంగాణ సీఎంతో టీటీడీ చైర్మన్ భేటీ

TIRUMALA, 21 NOVEMBER 2024: TTD Chairman Sri B.R. Naidu paid a courtesy call on Telangana Chief Minister Sri Revanth Reddy at the later’s residence in Jubilee Hills in Hyderabad on Thursday.

On this occasion, the TTD Board Chief presented the Pattu Vastram to CM of TS.

Later the TS CM also felicitated Sri BR Naidu with a shawl, presented a memento and conveyed his best wishes on becoming the Chairman of TTD Trust Board.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తెలంగాణ సీఎంతో టీటీడీ చైర్మన్ భేటీ

తిరుమల, 21 నవంబర్ 2024:: టిటిడి ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా టీటీడీ బోర్డు ధర్మకర్తల మండలి చైర్మన్ తెలంగాణ సీఎంకు పట్టువస్త్రం అందజేశారు.

అనంతరం టీటీడీ ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలిసిన శ్రీ బీఆర్‌ నాయుడును సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.