TTD CHAIRMAN OFFERS PRAYERS IN SRI KALAHASTI _ శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు

Tirupati, 26 February 2025: TTD Trust Board Chairman Sri BR Naidu along with his family visited Sri Kala Hasteeshwara temple on the auspicious day of Maha Sivaratri on Wednesday and offered prayers to the presiding deity.

Local MLA Sri Bojjala Sudhir Reddy welcomed the TTD board Chief and his family members at the temple and made Darshan arrangements.

The TTD Chairman first paid obeisance to Sri Dakshinamurthy, the Kshetrapalaka of the ancient Lord Siva temple.

After darshan, the Vedic scholars blessed the TTD Chairman and later Prasadams are presented along with the portrait of Swami and Ammavaru.

Speaking on the occasion, the Chairman said the elaborate arrangements made in the temple including darshan, floral and electrical illumination for devotees are commendable.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు

తిరుపతి, 2025, ఫిబ్రవరి 26: శ్రీకాళహస్తీశ్వరున్ని కుటుంబ సమేతంగా టిటిడి ఛైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు దంపతులు బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు.

ఆలయం వద్దకు చేరుకున్న బీ.ఆర్.నాయుడు కుటుంబ సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు. క్షేత్రపాలకుడు దక్షిణామూర్తిని మొదటగా దర్శించుకున్న టిటిడి ఛైర్మన్ కు దర్శనానంతరం వేద పండితులు టిటిడి ఛైర్మన్ ను ఆశీర్వదించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల చిత్రపటంతో పాటు ప్రసాదాల అందజేశారు.

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ మాట్లాడుతూ, ఆలయంలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని అభినందించారు. విద్యుత్, పుష్పాలంకరణలు ఆధ్యాత్మిక భావాన్ని మరింతగా పెంపొందిస్తున్నాయని తెలిపారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది