TTD CHAIRMAN WARNS ACTION AGAINST FAKE WEBSITES _ నకిలీ వెబ్ సైట్ పై చర్యలకు టీటీడీ చైర్మన్ ఆదేశం.

Tirumala, 7 December 2020: TTD Chairman Sri YV Subba Reddy has warned against fake social media websites of stringent action legally, if they try to cheat devotees.

This warning came in the wake when www.balaji prasadam.com, a fake website found misguiding devotees of delivering Srivari laddu Prasadam anywhere in the country which went viral on social media.

Responding to reports of fake websites the TTD chairman also directed the IT department to take suitable action to block such fake websites.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నకిలీ వెబ్ సైట్ పై చర్యలకు టీటీడీ చైర్మన్ ఆదేశం.

తిరుపతి. 7 డిసెంబరు 2020: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచంలో ఎక్కడైనా డోర్ డెలివరీ చేస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్న www balaji prasadam.com అనే నకిలీ వెబ్ సైట్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సోమవారం విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.

శ్రీవారి ప్రసాదాల పేరుతో భక్తులను మోసం చేస్తున్న వెబ్ సైట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం శ్రీ సుబ్బారెడ్డి దృష్టికి వచ్చింది.దీనిపై ఆయన వెంటనే స్పందించారు. నకిలీ వెబ్ సైట్ వివరాలు సేకరించి సంబంధిత వ్యక్తులపై కేసు పెట్టాలని ఆదేశించారు. ఐటి విభాగం సహాయంతో వెబ్ సైట్ ను బ్లాక్ చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది