TTD CONDEMNS FAKE NEWS ON BOY’S DEATH AT MTVAC _ అసత్య కథనాలతో టీటీడీపై బురదజల్లడం మానుకోవాలి
ADDITIONAL EO URGES MEDIA TO REPORT FACTS
Tirumala, 25 February 25: Refuting the fake news spread by a media channel which allegedly reported the death of boy in a stampede at Annaprasadam Bhavan, TTD Additional EO Sri Ch Venkaiah Chowdary urged the media to report only correct news keeping in mind the sentiments of devotees present globally.
Addressing a press conference in Annamaiah Bhavan at Tirumala on Tuesday evening, the Additional EO has given the details of the entire episode.
A 16 years old boy named Sri Manjunatha from Madikeri, Karnataka fell unconscious after he ran up along a ramp at Matrusri Tarigonda Vengamamba Annaprasada Bhavanam(MTVAC) in Tirumala on the evening March 22.
The staff on duty Immediately administered CPR and admitted the boy to Ashwini Hospital in Tirumala.
Subsequently, the boy was shifted to the SVIMS Super Specialty Hospital in TTD Ambulance to Tirupati upon the advice of the doctors for a better medication. But unfortunately, the boy breathed his last today.
Adding further he said, ”In fact, the boy was suffering from a chronic heart disease since he was nine years old and also under went treatment for the same at Jayadev hospital in Bengaluru.
Even the boy’s father has asked his son’s body without postmortem stating that his died of a chronic heart problem.
While the facts are like this, a media channel reported that the boy died due to a stampede in Annaprasada Bhavanam at Tirumala which is not true.
Everything is recorded in 3000 cameras put across Tirumala. You can see the visuals of the boy collapsing on his own at MTVAC which was recorded in CC cameras, the Additional EO said and displayed the visuals to media personnel.
Further he appealed to devotees through media to care of their personal health security and safety also and reiterated that media should cross check the facts with authorities and give correct news only keeping in view the sentiments of the devotees.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అసత్య కథనాలతో టీటీడీపై బురదజల్లడం మానుకోవాలి
అన్నప్రసాద కేంద్రంలో తోపులాట ప్రచారాన్ని ఖండించిన టీటీడీ అదనపు ఈవో
తిరుమల, 2025 ఫిబ్రవరి 25: అసత్య కథనాలతో టీటీడీపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన సమావేశంలో మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద కేంద్రంలో తొక్కిసలాటలో ఓ బాలుడు మృతి చెందినట్లు ఓ టీవీ ఛానళ్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఈ ఘటనపై సీసీ కెమెరా ఫుటేజ్ ను ఆయన మీడియాకు చూపించి వాస్తవాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలోని ఏ ప్రాంతంలోనైనా తొక్కిసలాటకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. బాలుడు మంజునాథ మృతి ఘటనపై సీసీ కెమెరాల ద్వారా అన్ని దృశ్యాలను పరిశీలించామని చెప్పారు. మంజునాథ అనే బాలుడు తన కుటుంబ సభ్యులతో కలిసి అన్న ప్రసాద కేంద్రానికి వచ్చాడని, ఈ క్రమంలో భవనంలో ర్యాంప్ పై పరిగెత్తుతూ ఒక్కసారిగా కింద పడిపోయాడని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది బాలుడికి సీపీఆర్ చేసి టీటీడీ అంబులెన్స్ ద్వారా అశ్వినీ ఆసుపత్రికి తీసుకొచ్చారన్నారు. చికిత్స అందించిన వైద్యులు బాలుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారన్నారు.
బాలుడి ప్రాణం కాపాడేందుకు అన్ని విధాలా టీటీడీ ప్రయత్నించినప్పటికి బాలుడు చనిపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడికి తొమ్మిది సంవత్సరాల వయస్సులోనే గుండెకు సంబంధించిన శాస్త్ర చికిత్స జరిగిందని తెలియజేశారు. బాలుడి తల్లిదండ్రులే తమ బిడ్డకు గుండె సంబంధిత సమస్య ఉందని ఒప్పుకుని పోస్టుమార్టం కూడా వద్దని మృతదేహాన్ని తీసుకెళ్తామని చెప్పారు. అయినప్పటికి ఓ టీవీ ఛానళ్లలో వాస్తవాలకు దూరంగా టీటీడీ పై బురదజల్లే విధంగా తొక్కిసలాటలో బాలుడు మృతి చెందినట్లు కథనాలు రావడం బాధాకరమని అన్నారు. అసత్య కథనాలతో టీటీడీపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది