TTD CONDEMNS THE ALLEGATIONS _ అన్న ప్రసాదంలో జెర్రీ పడిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారం

TIRUMALA, 05 OCTOBER 2024: TTD has clarified that the allegation by a devotee that a Millipede is found in the Anna Prasadam at Madhava Nilayam was baseless and false.

TTD prepares hot Anna Prasadam for thousands of devotees that come for Srivari Darshan and it is an unconvincing claim by the devotee that a centipede fell in Annaprasadam.  Even if rice is mixed with curd the creature could not go unnoticed.

TTD said it was a deliberate attempt to defame the holy institution and hurt the sentiments of devotees who consume Anna Prasadam as a blessing from Srivaru.

TTD appeals to devotees to not be carried away by such baseless and false news and fave faith in Sri Venkateswara and TTD.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్న ప్రసాదంలో జెర్రీ పడిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారం

తిరుమల, 05 అక్టోబరు 2024:: మాధవ నిలయంలోని అన్నప్రసాదములో తాము తిన్న అన్నప్రసాదంలో జర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవదూరం.

తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాదిమంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో టిటిడి వారు అన్నప్రసాదాలను తయారుచేస్తారు.

అంత వేడిలో ఏమాత్రం చెక్కుచెదరకుండా ఒక జెర్రీ ఉందని సదరు భక్తుడు పేర్కొనటం ఆశ్చర్యకరం.

ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియపెట్టి తరువాత పెరుగు కలుపుతారు. అటువంటప్పుడు ఏమాత్రం రూపు చెదరకుండా జర్రి ఉండటం అనేది ఇది పూర్తిగా కావాలని చేసిన చర్య మాత్రమే గా భావించాల్సి వస్తుంది.

దయచేసి భక్తులు ఇటువంటి సత్యదూర వార్తలను నమ్మకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయబడింది