TTD CONDEMNS THE SOCIAL MEDIA POST ON LADDU PRASADAM _ లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు సత్య దూరం

Tirumala, 12 June 2025: TTD has condemned a fake post on Laddu Prasadam on Social Media by a person named Naveen Kumar hailing from Ranga Reddy district of Telengana State.

A peep into the facts reveals that on June 8(Sunday last), the above-mentioned person has alleged that he had suffered an injury in his mouth while eating Laddu Prasadam. 

In reality he has bitten his tongue himself while consuming Laddu Prasadam.

However, TTD has sent him to Aswini hospital by arranging an Ambulance where a series of multiple medical tests were carried out by the doctors.

The test reports confirmed that it was only a minor prick underneath his tongue following the tongue bite. 

Later the person was even sent to SVIMS Super Specialty Hospital in Tirupati and medical tests were carried out. The doctors at SVIMS also affirmed a minor prick in their medical tests also.

However, the person with a malicious intention of getting compensation from TTD is spreading false news against Laddu Prasadam on Social Media.

Such fake campaigns will hurt the sentiments of devotees and TTD warns that a legal action will be initiated against him.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు సత్య దూరం

తిరుమల, 2025 జూన్ 13: తిరుమల లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్‌ అనే వ్యక్తి ఆరోపణలను టీటీడీ తీవ్రంగా ఖండించింది.

జూన్ 8న, స్వామివారి లడ్డూ ప్రసాదం తినేటప్పుడు నోటిలో గాయమైందని సదరు వ్యక్తి ఆరోపణలు చేశారు. వెంటనే స్పందించిన టీటీడీ, సదరు వ్యక్తిని అంబులెన్సు ద్వారా తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. అనంతరం స్విమ్స్ ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.

ఈ వైద్య పరీక్షలలో సదరు వ్యక్తి ప్రసాదం తినేటప్పుడు తన నాలుకను తానే కొరుక్కోవడంతో నాలుక కింద భాగంలో కేవలం చిన్నపాటి గాయం అయినట్లు రిపోర్ట్స్ వచ్చాయి.

అయినప్పటికీ, టీటీడీ వద్ద నష్ట పరిహారం పొందాలనే దురుద్దేశంతో సదరు వ్యక్తి లడ్డూ ప్రసాదంపై social media లో ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు టీటీడీ గుర్తించింది.

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేయడాన్ని టీటీడీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజలను గందరగోళపరిచేలా ఇలాంటి దురుద్దేశపూరిత చర్యకు పాల్పడిన సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ స్పష్టం చేస్తోంది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.