TTD CVSO AND TIRUPATI URBAN SP REVIEW BRAHMOTSAVAM SECURITY ARRANGEMENTS _ శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ భద్రతా ఏర్పాట్ల‌పై టిటిడి సివిఎస్వో, తిరుప‌తి అర్బన్ ఎస్పీ స‌మీక్ష‌

Tirumala, 02 October 2021: TTD CVSO Sri Gopinath Jatti along with Tirupati Urban SP Sri Venkatappala Naidu reviewed security arrangements to be made for ensuing annual Brahmotsavams at Tirumala.

 

The meeting was held at Annamayya Bhavan with TTD Vigilance and security and police in Tirumala on Sunday. 

 

Speaking on the occasion Sri Gopinath Jatti directed all TTD vigilance officials to make secure arrangements for the Srivari annual Brahmotsavam to be observed in Ekantham from October 7 to15 in view of Covid-19 guidelines.

 

He said adequate measures should be taken in coordination with district police keeping in view last year’s experience as more devotees might visit Tirumala this year in spite of Ekantha Brahmotsavam due to relaxation of covid norms on inter- state transportation.

 

The CVSO directed the vigilance sleuths to allow only those pilgrims beyond Alipiri, who come with either Covid double doses certificate or Covid Negative test report done three days before besides checking their darshan tickets and tokens as instructed by TTD.

 

The Urban SP discussed about the bundobust arrangements particularly on Garuda Seva day on October 11, during visit of Honourable AP CM Sri YS Jaganmohan Reddy.

 

More steps will be taken to ensure safety of dignitaries at both Tirupati and also in Tirumala where the CM is taken part in many inaugural events.

 

He also said the Quick Response Teams and Rescue Teams will be stationed at  Alipiri, Sri Padmavati Rest House, Srivari temple, Bedi Anjaneya Swamy temple, new Boondi Potu and all major junctions at Tirumala during CM’s visit.

 

He said only those with tickets and tokens alone will be allowed after thorough verification and appealed to devotees to cooperate with TTD and police.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ భద్రతా ఏర్పాట్ల‌పై టిటిడి సివిఎస్వో, తిరుప‌తి అర్బన్ ఎస్పీ స‌మీక్ష‌

తిరుమల, 2021 అక్టోబ‌రు 02: శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాలు అక్టోబ‌రు 7 నుండి 15వ తేదీ వ‌ర‌కు ఏకాంతంగా జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో చేయ‌వ‌ల‌సిన భద్రత ఏర్పాట్ల‌పై టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాధ్‌జెట్టి, తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ శ్రీ వెంక‌ట‌ప్పల‌ నాయుడుతో క‌లిసి శ‌నివారం స‌మీక్షించారు. తిరుమలలోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టిటిడి విజిలెన్స్, పోలీస్ అధికారుల‌తో స‌మీక్ష సమావేశం జ‌రిగింది.

ఈ సందర్భంగా సివిఎస్వో మాట్లాడుతూ గ‌త ఏడాది సెప్టెంబ‌రులో వార్షిక‌, అక్టోబ‌రులో న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హించిన‌ట్లే ఈ ఏడాది కూడా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నట్లు తెలిపారు. గ‌త ఏడాది కోవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా వివిధ‌ రాష్ట్రాల నుండి ర‌వాణా సౌక‌ర్యాం లేద‌ని, అందువ‌ల‌న త‌క్కువ సంఖ్య‌లో భ‌క్తులు తిరుమ‌ల‌కు వ‌చ్చార‌ని చెప్పారు. అయితే ఈ ఏడాది కోవిడ్ నిబంధ‌న‌ల స‌డ‌లింపు కార‌ణంగా గ‌త ఏడాది కంటే ఎక్కువ మంది భ‌క్తులు వ‌స్తార‌న్నారు. కావున ఈ బ్ర‌హ్మోత్ప‌వాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టిటిడి నిఘా, భద్రతా విభాగం పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాల‌న్నారు.

దర్శన టికెట్లు మరియు టోకెన్లు కలిగిన
భక్తులందరూ టీటీడీ సూచించిన మేరకు కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ, రెండు వాక్సినేషన్ డోసేజ్ సర్టిఫికెట్లు లేదా 72 గంటల ముందు చేసుకున్న కోవిడ్ నెగటివ్ రిపోర్టు ఖచ్చితంగా తీసుకువస్తేనే అలిపిరి చెంత అనుమతించాలని ఆయన ఆదేశించారు.

ముఖ్యంగా అక్టోబ‌రు 11వ తేదీ గ‌రుడ సేవ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి శ్రీ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్న‌ట్లు చెప్పారు. తిరుప‌తి, తిరుమ‌ల‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నందున మ‌రింత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ ఏర్పాట్లు చేయాల‌న్నారు.

శ్రీ‌వారి ద‌ర్శ‌నం టోకెట‌న్లు లేని భ‌క్తుల‌కు అనుమ‌తి లేదు : అర్బ‌న్ ఎస్పీ

అనంత‌రం అర్బ‌న్ ఎస్పీ మాట్లాడుతూ అలిపిరి, ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నం, శ్రీ‌వారి ఆల‌యం, బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం, బూంది పోటు, తిరుమ‌ల‌లోని ప్ర‌ధాన‌ కూడ‌ళ్ల‌లో అద‌న‌పు పోలీస్ సిబ్బందిని, శీఘ్ర ప్రతి స్పందన బృందాలు (క్విక్ రెస్పాన్స్ టీంలు), రెస్కూటీంలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఎస్ఎస్‌డి, రూ.300- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు క‌లిగిన భ‌క్తుల‌ను మాత్ర‌మే అలిపిరి వ‌ద్ద అనుమ‌తించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ద‌ర్శ‌నం టోకెన్లు లేదా టికెట్లు లేని భ‌క్తుల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో తిరుమ‌ల‌కు అనుమ‌తిలేద‌ని, ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టిటిడికి మ‌రియు పోలీస్ సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ స‌మీక్ష‌లో అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, తిరుమ‌ల అద‌న‌పు ఎస్పీ శ్రీ మునిరామ‌య్య‌, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ మ‌నోహ‌ర్‌, ఎవిఎస్వోలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.