TWO MORE TAKE OATH _ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ మిలింద్ నర్వేకర్, శ్రీ బోర సౌరబ్‌ ప్రమాణస్వీకారం

TIRUMALA, 02 OCTOBER 2021: Sri Bora Saurabh and Sri Milind Keshav Narvekar took oath as TTD Trust Board members on Saturday in the Srivari temple.
 
 

The Additional EO Sri AV Dharma Reddy administered the oath at Bangaru Vakili.

 

 

After darshan of Sri Venkateswara Swamy, both the board members were rendered Vedaseervachanam at Ranganayakula Mandapam and later Theertha Prasadams, laminated photos of Srivaru and Coffee table books on TTD were presented to them.

 

 

Deputy EOs Sri Ramesh Babu, Smt Sudharani were also present.

 

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ మిలింద్ నర్వేకర్, శ్రీ బోర సౌరబ్‌ ప్రమాణస్వీకారం

తిరుమల, 2021 అక్టోబ‌రు 02: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా శ్రీ మిలింద్ నర్వేకర్, శ్రీ బోర సౌరబ్ శ‌నివారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి శ్రీ మిలింద్ నర్వేకర్, శ్రీ బోర సౌరబ్‌చే ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేశారు.

అనంతరం అద‌న‌పు ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్ బాబు, శ్రీమతి సుధారాణి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.