TTD DHARMARATHAM TO START FOR MAHA KUMBH MELA ON JANUARY 08 _ జనవరి 8న తిరుమల నుండి ప్రయాగ్ రాజ్ కు శ్రీవారి కళ్యాణ రథం ప్రారంభం
REPLICA TEMPLE OF SRIVARU AT MAHA KUMBH MELA – EO
Tirumala, 07 January 2025: As part of the propagation of Hindu Sanatana Dharma, TTD is constructing a replica temple of Sri Venkateswara Swamy during the prestigious Maha Kumbh Mela at Prayagraj in Uttar Pradesh and a Dharma Ratham carrying deputed staff of devotees will start with the divine blessings of Srivaru on January 08 at 7am from Tirumala, said TTD EO Sri J Syamala Rao.
Addressing media persons at Annamaiah Bhavan in Tirumala on Tuesday noon, the EO said this mega religious event is scheduled from January 13 to February 26 and the model temple is coming up in 2.89acre land at Sector 6, Bhajrang Das Road, Prayagraj, adjacent to the famous Naga Vasuki Temple.
He said the Kainkaryams and Utsavas will be organized in the style of Tirumala so that the Northern devotees can enjoy the grandeur of Sri Venkateswara Swamy and every day all sevas starting from Suprabhatam to Ekanta Seva will also be conducted
TTD is also organizing Srivari Kalyanams on January 18, 26, February 3 and 12, he maintained.
For the Maha Kumbh Mela, TTD is also deputing a team of priests, Vedic scholars and staff from various departments from TTD to manage the temple activities and provide facilities for the multitude of visiting devotees, he added.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జనవరి 8న తిరుమల నుండి ప్రయాగ్ రాజ్ కు శ్రీవారి కళ్యాణ రథం ప్రారంభం
మహా కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం
తిరుమల, 2025 జనవరి 07: హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ రాజ్(అలహాబాద్) వద్ద జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళాకు విచ్చేసే కోట్లాదిమంది భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించేందుకుగాను టీటీడీ నమూనా ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 6, భజరంగ్ దాస్ రోడ్డులోని నాగవాసుకి ఆలయ సమీపంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎకరాల్లో శ్రీవారి నమూనా ఆలయ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఉత్తరాది భక్తులు శ్రీవారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా తిరుమల తరహాలో స్వామివారి కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతిరోజు తిరుమల తరహాలో నిత్యం సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు నిర్వహిస్తామన్నారు.
జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీలలో శ్రీవారి కల్యాణాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తునట్లు చెప్పారు. మహా కుంభమేళాలో శ్రీవారి నమూన ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాల ఏర్పాటుకు టీటీడీ నుండి అర్చక స్వాములు, వేద పండితులు, వివిధ విభాగాల సిబ్బందిని ప్రయాగ్ రాజ్ కు పంపుతున్నట్లు తెలిపారు.
తిరుమల నుండి ప్రయాగ్ రాజ్ కు 8వ తేది ఉదయం 7 గంటలకు శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, సీవీఎస్వో శ్రీ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.