TTD EO AT MANTRALAYAM _ మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారికి శేషవస్త్రం సమర్పించిన టిటిడి ఈవో

Tirumala, 18 August 2024:  On the occasion of the 353rd Aradhana Mahotsava of Mantralaya Sri Guru Raghavendra Swami in

Kurnool District, on behalf of TTD, EO Sri J. Syamala Rao presented Seshavastram on Sunday.

Since the year 2006, TTD has been presenting Srivari Seshavastram to Sri Raghavendra Swamy in recognition of the services of the great Guru who worked for the spread of Hindu Sanatana Dharma.  

Sri Raghavendra Swamy was born by the grace of Sri Venkateswara Swamy.  Sri Raghavendra Swami before taking his sainthood was also known as Venkanna Bhatta, Venkatacharya.

The present Pontiff of Mantralaya Sri Subudendra Thirtha Swamy offered blessings to the TTD EO on this occasion.

Tirumala temple Parupattedar Sri Bala Subramanyam and others participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారికి శేషవస్త్రం సమర్పించిన టిటిడి ఈవో

తిరుమ‌ల, 2024 ఆగస్టు 18: కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ గురురాఘవేంద్ర స్వామివారి 353వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా టిటిడి తరపున ఈవో శ్రీ జె.శ్యామలరావు దంప‌తులు ఆదివారం శేషవస్త్రం సమర్పించారు.

హైందవ సనాతన ధర్మవ్యాప్తికి కృషి చేసిన సద్గురువుల భగవత్‌ భాగవత సేవల దృష్ట్యా 2006వ సంవత్సరం నుంచి శ్రీ రాఘవేంద్రస్వామివారికి శ్రీవారి శేషవస్త్రాన్ని టిటిడి సమర్పిస్తోంది. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారి కృపతో శ్రీ రాఘవేంద్రస్వామివారు జన్మించారు. శ్రీరాఘవేంద్రస్వామి పూర్వాశ్రమ నామధేయం కూడా వెంకన్న భట్ట, వెంకటాచార్యగా ప్రశస్తి.

ముందుగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారికి ఈవో శ్రీ జె శ్యామలరావు శేషవస్త్రాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారు ఈవో దంప‌తులను ఆశీర్వదించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.