TTD EO BEGINS VIGILANCE WEEK _ టిటిడిలో విజిలెన్స్ వారోత్స‌వాలు ప్రారంభించిన ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ ‌రెడ్డి

Tirupati, 26 October 2021: The TTD Executive Officer Dr. KS Jawahar Reddy inaugurated the National Vigilance Week on Tuesday.

As per the schedule envisaged by the Central Vigilance Commission, the NVW will be observed from October 26 till November 1 to spread awareness on anti-corruption and security in society. The National Vigilance Week is observed as a tribute to Iron man of India Sardar Patel on his Birth Anniversary on October 26.

TTD EO served the pledge to all TTD HoDs and employees led by CVSO Sri Gopinath Jatti that they will strive to fight against corruption and protect the interests of the organization. The pledge also included the promotion of transparency, honesty, and equality in their services in discharging their duties and responsibilities.

TTD Additional EO Sri AV Dharma Reddy, JeOS Smt Sada Bhargavi and Sri Veerabrahmam, DLO Sri Reddappa Reddy, CE Sri Nageswara Rao, FA&CAO Sri O Balaji, Additional CVSO Sri Siva Kumar Reddy, VGOs Sri Bali Reddy, Sri Manohar, and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడిలో విజిలెన్స్ వారోత్స‌వాలు ప్రారంభించిన ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ ‌రెడ్డి

తిరుప‌తి, 2021 అక్టోబ‌రు 26 ; కేంద్ర విజిలెన్స్ క‌మిష‌న్(సివిసి) పిలుపు మేర‌కు దేశ వ్యాప్తంగా ‌అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు నిర్వ‌హిస్తున్నఅవినీతి వ్య‌తిరేక‌, భ‌ద్ర‌తా అవ‌గాహ‌న వారోత్సవాలను మంగ‌ళ‌వారం టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్.జవహర్ రెడ్డి ప్రారంభించారు.

మంగ‌ళ‌వారం ఉద‌యం సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి ఆధ్వ‌ర్యంలో టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నం వ‌ద్ద అన్ని విభాగాల ఆధిపతులు, ఉద్యోగులతో తాము అవినీతికి వ్య‌తిరేకంగా , సంస్థ ప్ర‌యోజ‌నాలు కాపాడుతూ ప‌ని చేస్తామ‌ని ఈవో ప్ర‌తిజ్ఞ చేయించారు. ఉద్యోగులు, అధికారులు నైతిక ధోర‌ణిని ప్రోత్స‌హిస్తూ, నిజాయి‌తి, స‌మైక్య‌త‌తో పార‌ద‌ర్శ‌క సేవ‌లు అందిస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. అక్టోబ‌రు 31న ఉక్కుమ‌నిషి స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జయంతిని పుర‌స్క‌రించుకుని ప్రారంభ‌మైన ఈ వారోత్స‌వాలు న‌వంబ‌రు 1వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, డిఎల్‌వో శ్రీ రెడ్డ‌ప్ప రెడ్డి, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎఫ్ఏ అండ్ సిఏవో శ్రీ బాలాజి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్ రెడ్డి, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ మ‌నోహ‌ర్‌, ఎవిఎస్వోలు శ్రీ సాయి గిరిధర్, శ్రీ‌మ‌తి క‌ల్ప‌న‌ పాల్గొన్నారు.‌

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.