TTD EO INSPECTS FOUR MADA STREETS _ శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులను తనిఖీ చేసిన టిటిడి ఈవో

TIRUMALA, 30 AUGUST 2024:  TTD EO Sri J Syamala Rao along with the Additional EO Sri Ch Venkaiah Chowdaryna, CVSO Sri Sridhar and District SP Sri Subbarayudu inspected the four Mada streets in Tirumala encircle the Tirumala temple to oversee the procession of Vahana Sevas especially the arrangements of Garuda Seva for the ensuing annual brahmotsavams. 

As a part of the inspection on Friday evening, the top brass officials of TTD along with the District Police commenced their inspection at Vahana Mandapam and observed the various Entry-Exit points at different galleries, second filling of galleries on Garuda Seva, security aspects, the in and out gates to Swamy Pushkarini on the last day of Brahmotsavam on Chakra Snanam and various other related aspects.

Later speaking to media persons, the EO said, all the departments have already commenced the arrangements for the big religious festival which is scheduled from October 4 to 12. He said all the departments in coordination with the police are working towards ensuring a hassle-free Vahana Sevas to the multitude of visiting pilgrims to Tirumala on the occasion. 

CE Sri Nageswara Rao, SE 2 Sri Satyanarayana, DyEO Health Smt Asha Jyothi, Health Officer Sri Madhusudhan Prasad, VGOs Sri Surendra, Sri Ramkumar and other officials were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులను తనిఖీ చేసిన టిటిడి ఈవో

తిరుమల 30 ఆగస్టు 2024: తిరుమల శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధులను టిటిడి ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీ శ్రీధర్ మరియు జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడుతో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో విశేషమైన గరుడసేవకు ఏర్పాట్లను పరిశీలించారు.

ఇందులో భాగంగా, జిల్లా పోలీసులతో పాటు టీటీడీ ఉన్నతాధికారులు వాహన మండపం నుండి తనిఖీలు ప్రారంభించి, వివిధ గ్యాలరీల్లోని ప్రవేశ నిష్క్రమణ మార్గాలను, గరుడ సేవలో గ్యాలరీలను రెండవసారి నింపడం, తదితర భద్రతా అంశాలు పరిశీలించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున చక్రస్నానం, ఇతర సంబంధిత అంశాలపై స్వామి పుష్కరిణి లోపలికి మరియు వెలుపలికి వచ్చే మార్గాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో ఈవో మాట్లాడుతూ, అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు. టిటిడి నిఘ మరియు భద్రత విభాగము, పోలీసుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులను ఉచితంగా చేరవేసే ధర్మ రథాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఈ 2 శ్రీ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో హెల్త్‌ శ్రీమతి ఆశాజ్యోతి, హెల్త్‌ ఆఫీసర్‌ శ్రీ మధుసూధన్‌ ప్రసాద్‌, విజిఓలు శ్రీ సురేంద్ర, శ్రీ రామ్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది