TTD EO INSPECTS TIRUMALA PARKING LOTS _ తిరుమ‌ల‌లో పార్కింగ్ ప్రాంతాల‌ను ప‌రిశీలించిన టిటిడి ఈవో

Tirumala, 9 April 2021: TTD is mulling to develop multilevel parking space in Tirumala for 3000 more vehicles, in addition, to the present 4000 capacity to facilitate lakhs of devotees visiting the holy shrine every day.

TTD EO Dr KS Jawahar Reddy on Friday along with Additional EO Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti inspected various areas in Tirumala to find out their feasibility for vehicle parking.

Speaking to media after inspection Additional EO told media persons, locations near Mullagunta, Seva Sadan and PAC- 5 are being considered for promoting parking lots including multi-level parking.

He said the present RTC garage will also be shifted to a vacant space near Balaji Nagar where the new RTC garage is under construction.

Earlier the EO and Additional EO visited some places near Mallagunta, Employees canteen backside, Seva Sadan, RB circle, Rambagicha bus stand, Balaji Nagar, PAC-3 and Outer Ring Road.

TTD CE Sri Ramesh Reddy, VGO Sri Bali Reddy, Health Officer Dr RR Reddy, AVSO Sri Gangaraju and other engineering officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌లో పార్కింగ్ ప్రాంతాల‌ను ప‌రిశీలించిన టిటిడి ఈవో

తిరుమల, 2021 ఏప్రిల్ 09: తిరుమ‌లలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పార్కింగ్ స్థ‌లాల‌ను టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌. జ‌వ‌హ‌ర్ రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోసినాథ్ జెట్టితో క‌లిసి శుక్ర‌వారం ఉద‌యం ప‌రిశీలించారు.

అనంత‌రం అద‌నపు ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే ల‌క్ష‌లాది మంది భ‌క్తుల సౌక‌ర్యార్థం మ‌రిన్ని పార్కింగ్ స్థ‌లాల‌ను తిరుమ‌ల‌లో అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. యాత్రికులు గ‌దులు తీసుకున్న ప‌రిస‌రాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తే వారికి మ‌రింత సౌక‌ర్యావంతంగా ఉంటుంద‌న్నారు. ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో 4000 వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉంద‌ని, అద‌నంగా మ‌రో 3000 వాహనాలకు పార్కింగ్ క‌ల్పించేందుకు టిటిడి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని చెప్పారు. మ‌ల్టీలెవ‌ల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయ‌డానికి ముల్లగుంట‌, సేవాస‌ద‌న్ ప‌క్క‌న‌‌‌ ఉన్న ప్రాంతా‌ల్లో అవ‌కాశం ఉంద‌న్నారు. అదేవిధంగా యాత్రికుల‌కు టైం స్లాట్ టికెట్ల‌పై పూర్తి అవ‌గాహ‌న ఉన్నందున పిఏసి – 5 బ‌దులు మ‌ల్టీలెవ‌ల్ కార్ పార్కింగ్ నిర్మిస్తున్నామ‌న్నారు. తిరుమ‌ల‌లో ఆర్‌టిసి బ‌స్సులు ఎక్క‌వ అయినందున ప్ర‌స్తుతం ఉన్న గ్యారేజ్‌ బ‌దులు బాలాజి న‌గ‌ర్ స‌మీపంలోని కాళీ స్థ‌లంను అభివృద్ధి చేసి అక్క‌డ ఆర్‌టిసి గ్యారేజ్ నిర్మించ‌నున్న‌ట్లు వివ‌రించారు.

కాగా అంత‌కుముందు ఈవో, అద‌న‌పు ఈవో తిరుమ‌ల‌లోని ముల్లగుంట‌, ఆర్‌బి స‌ర్కిల్, సేవాస‌ద‌న్ ప‌క్క‌న, ఎంప్లాయిస్ క్యాంటీన్ బ్యాక్ సైడ్, రాంబ‌గీచ బ‌స్టాండ్ ద‌గ్గ‌ర‌, బాలాజి న‌గ‌ర్‌, పిఏసి – 3 ఎదురుగా ఉన్న స్థ‌లం, ఔట‌ర్‌ రింగ్ రోడ్డు వంటి ప్రాంతాలను అధికారులతో క‌లిసి ప‌రిశీలించారు. ‌

ఈ కార్య‌క్ర‌మంలో సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆరోగ్య విభాగం అధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి, ఏవిస్వో శ్రీ గంగ‌రాజు, ఇత‌ర ఇంజినీరింగ్ అధికారు‌లు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది