TTD EO INSPECTS TOKEN COUNTERS IN TIRUPATI _ తిరుపతి కౌంటర్లలో స్థానికులకు మాత్రమే టికెట్లు

Tirupati 22 December 2020: With just two more days left for the big day of Vaikuntha Ekadasi, TTD EO Dr KS Jawahar Reddy along with Additional EO Sri AV Dharma Reddy inspected all the token issuing centres for Vaikunta Dwara Darshan in Tirumala temple in Tirupati on Tuesday.

Speaking to media persons, EO said, Vaikuntha Dwara Darshan will be open for pilgrims in Tirumala temple from December 25 to January 3. Already we have issued online tickets to pilgrims for these 10 days. The Offline tickets will be issued from December 24. In view of the prevailing Covid situation, we made repeated appeals to devotees that this time, offline tokens will be issued to only locals. He also alarmed of the latest stain which was discovered in UK and cautioned devotees to follow all Covid norms while obtaining tokens at offline counters.

“We have already set up 5 centres at different places in Tirupati including, Municipal Corporation, MR Palle Market, Ramachandra Pushkarini, Mahati Auditorium, Bairagipatteda Ramanaidu Municipal High School premises. Enough security arrangements have also been made at all these points”, he added.

CVSO Sri Gopinath Jatti, TMC Commissioner Sri Girisha, CE Sri Ramesh Reddy, SE1 Sri Jagadeeshwar Reddy, Additional CVSO Sri Siva Kumar Reddy, GM IT Sri Sesha Reddy, DSP Sri Murali Krishna were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

తిరుపతి కౌంటర్లలో స్థానికులకు మాత్రమే టికెట్లు
– బయటి ప్రాంతాల వారు ఈ విషయం గమనించండి
– కౌంటర్లను పరిశీలించిన టీటీడీ ఈఓ డాక్టర్ జవహర్ రెడ్డి

తిరుపతి 22 డిసెంబరు 2020: డిసెంబరు 25 నుంచి జనవరి 3 వ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లు 24వ తేదీ నుంచి తిరుపతిలో స్థానికులకు మాత్రమే జారీ చేస్తామని టీటీడీ ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. బయటి ప్రాంతాల భక్తులు ఈ విషయం గమనించాలని ఆయన కోరారు.

వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి స్థానికులకు మాత్రమే 10 రోజుల పాటు సర్వ దర్శనం టికెట్లు జారీ చేయడానికి ఏర్పాటు చేసిన కౌంటర్లను మంగళవారం ఆయన పరిశీలించారు. రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం, ఎం ఆర్ పల్లి మార్కెట్, బైరాగి పట్టెడ రామానాయుడు మున్సీపల్ హై స్కూల్, మున్సిపల్ ఆఫీసు లోని ఈ కౌంటర్ల వద్ద క్యూ లైన్లు, ఇతర ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ కేంద్రాల్లో రోజుకు 10 వేల చొప్పున 10 రోజులకు లక్ష సర్వ దర్శనం టికెట్లు జారీ చేస్తామన్నారు. రోజుకు 20 వేల చొప్పున 10 రోజులకు 2 లక్షల టికెట్లు ఇప్పటికే ఆన్లైన్ లో జారీ చేసినట్లు ఈఓ తెలిపారు. టికెట్ ఉన్న భక్తులను మాత్రమే అలిపిరి, శ్రీ వారి మెట్టు నడకదారులు, అలిపిరి రోడ్డు మార్గంలో అనుమతిస్తామన్నారు. భక్తులు టికెట్ లేకుండా వచ్చి ఇబ్బంది పడవద్దని ఆయన కోరారు. ఇప్పటికే యూకే లో కొత్త వైరస్ వ్యాపిస్తున్నందు వల్ల కేంద్ర ప్రభుత్వం భారత్ నుంచి ఆ దేశానికి విమానాల రాక పోకలు నిలిపి వేసిందన్నారు. భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించి, టికెట్ లేని వారు జనవరి 4 వ తేదీ తర్వాత ఆన్లైన్లో దర్శనం టికెట్లు పొందే ప్రయత్నం చేసుకోవాలని ఈఓ సూచించారు.

అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి, సి వి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, మున్సిపల్ కమిషనర్ శ్రీ గిరీషా, సిఈ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్ఈ శ్రీ జగదీశ్వరరెడ్డి, ఐటి ఇంచార్జి శ్రీ శేషారెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివ కుమార్ రెడ్డి, డిఎస్పీ శ్రీ మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది