TTD EO LAUDS THE GROWING RECEPTION TO PARAKAMANI AND LADDU PRASADA SEVA _ పరకామణి మరియు లడ్డూ ప్రసాద సేవలకు విశేష ఆదరణ 

Tirumala, 28 Feb 2013: TTD EO Sri LV Subramanyam on Thursday expressed immense satisfaction over the growing reception to Parakamani and Laddu Prasada Seva which were introduced by TTD recently with an aim to provide better and transparent services to the visiting pilgrims.
 
In a high level review meeting which took place at Annamaiah Bhavan in Tirumala on Thursday, the TTD EO said, Parakamani Seva which was introduced by TTD during 17th August last, has become a huge hit among public. “So far 55 teams have taken part and 1988 Parakamani Sevakulu have rendered commendable services”, he added.
 
“Similarly the Laddu Prasada Seva which was introduced on January 13 this year is slowly picking up with 218 sevakulu belonging to 14 batches offering their impeccable services so far”, he maintained.
 
The EO said, “seeing the huge reception from the masses as well keeping in view the interests of pilgrims, TTD has decided to enhance the Parakamani Sevakulu from existing 50 to 80 and Laddu Prasada Sevakulu from existing 60 to 250”, he added
 
Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri GVG Ashok Kumar, Additional FACAO Sri Balaji, Additional ACVSO Sri Siva Kumar Reddy, CE Sri Chandra Sekhar Reddy, SE II Sri Ramesh Reddy and others were also present.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పరకామణి మరియు లడ్డూ ప్రసాద సేవలకు విశేష ఆదరణ

తిరుమల, ఫిబ్రవరి 28, 2013 : ”మానవ సేవయే మాధవ సేవ” అన్న ఉన్నతమైన సిద్ధాంతంతో తితిదే 13 ఏళ్ల క్రితం ప్రారంభించిన శ్రీవారి సేవలో భాగంగా ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన పరకామణి, లడ్డూ ప్రసాద సేవలకు భక్తుల నుండి విశేష ఆదరణ పెరగడం ముదావహమని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం అన్నారు.
 
తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం కార్యనిర్వహణాధికారి నేతృత్వంలో శ్రీవారి సేవ తదితర పరిపాలక అంశాలపై విస్తృతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. పరకామణి, లడ్డూ ప్రసాద సేవలపై ఈవో మాట్లాడుతూ అనతికాలంలోనే ఈ రెండు సేవలు విశేష జనాదరణ పొంది నిర్దేశిత లక్ష్యాలను అందుకోవడం శుభసూచకమన్నారు. గతేడాది ఆగస్టు 17వ తారీఖున ప్రారంభించిన పరకామణి సేవలో ఇప్పటివరకు 55 బృందాల్లో 1988 మంది పరకామణి సేవకులు పాల్గొని విశేష సేవలందించినట్టు చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుండి 1596 మంది, తమిళనాడు నుండి 204 మంది, కర్ణాటక నుండి 180 మంది, కేరళ నుండి 8 మంది పరకామణి సేవకులు ఉన్నట్టు వివరించారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు 1306 మంది, బ్యాంకు ఉద్యోగులు 382 మంది, ఇన్సూరెన్స్‌ ఉద్యోగులు 246 మంది ఉన్నట్టు తెలిపారు.
 
అదేవిధంగా ఈ ఏడాది జనవరి 13 భోగి పండుగ నాడు తితిదే ప్రవేశపెట్టిన లడ్డూ ప్రసాద సేవ కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందన్నారు. ఇప్పటివరకు 14 బృందాల్లో 218 మంది లడ్డూ ప్రసాద సేవకులు పాల్గొని భక్తులకు విశేష సేవలందించినట్టు ఈవో తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుండి 175 మంది, తమిళనాడు నుండి 39 మంది, కర్ణాటక నుండి నలుగురు లడ్డూ ప్రసాద సేవ చేసినట్టు చెప్పారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు 179 మంది, బ్యాంకు ఉద్యోగులు 28 మంది, ఇన్సూరెన్స్‌ ఉద్యోగులు 11 మంది ఉన్నట్టు వివరించారు.
 
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పరకామణి సేవకుల సంఖ్యను ప్రస్తుతమున్న 50 నుండి 80కి, లడ్డూ ప్రసాద సేవకుల సంఖ్యను ప్రస్తుతమున్న 60 నుండి 250కి పెంచనున్నట్టు వెల్లడించారు. త్వరలో దీనికి సంబంధించిన విధివిధానాలపై తగిన నిర్ణయం తీసుకోనున్నట్టు ఈవో తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో తితిదేతిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, అదనపు ఆర్థిక సలహాదారు మరియు ముఖ్య గణాంకాధికారి శ్రీ బాలాజీ, చీఫ్‌ ఇంజినీరు శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.