EARN GOOD WILL OF DEVOTEES WITH YOUR EFFICIENCY-TIRUPATI URBAN SP _ భద్రతా సిబ్బంది నైపుణ్యం పెంచుకోవాలి : అర్బన్‌ ఎస్పీ శ్రీ రాజశేఖర్‌బాబు

TIRUPATI, FEB 28: “The Vigilance and Security wing plays a vital role in the TTD administrative set up as they not only have to safeguard the world famous shrine of Lord Venkateswara but also have to provide safety measures to the multitude of visiting pilgrims”, said Sri Rajasekhar Babu, SP – Tirupati Urban District.


Addressing the valedictory of the training sessions of fourth batch of TTD security guards at SVETA bhavan in Tirupati on Thursday, the SP said, the security guards have to discharge their duties with disciplene, dedication and devotion to protect the interests of the visiting pilgrims, as the entire world is looking at you. You are
brand ambassadors of TTD whose foremost responsibility is to maintain the prestige of the world renowned hill shrine and earn respect and goodwill of devotees with your deeds”, he added.


TTD CVSO Sri GVG Ashok Kumar said, TTD is focussing on providing hi-fi security cover to entire Tirumala. This training will help the security personnel to effectively and efficiently face the threats posed by anti-social outfits.


VGO Sri Hanumanthu, SVETA Director Sri Ramakrishna were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భద్రతా సిబ్బంది నైపుణ్యం పెంచుకోవాలి : అర్బన్‌ ఎస్పీ శ్రీ రాజశేఖర్‌బాబు

తిరుపతి, ఫిబ్రవరి 28, 2013: తితిదేలో పని చేస్తున్న నిఘా మరియు భద్రతా సిబ్బంది నైపుణ్యాన్ని పెంచుకుని, దేశ విదేశాల నుండి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించాలని తిరుపతి అర్బన్‌ ఎస్పీ శ్రీ రాజశేఖర్‌బాబు సూచించారు. నాలుగో బ్యాచ్‌లోని 50 మంది తితిదే నిఘా, భద్రతా సిబ్బందికి తిరుపతిలోని శ్వేత భవనంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అర్బన్‌ ఎస్పీ శ్రీ రాజశేఖర్‌బాబు ప్రసంగిస్తూ శ్రీవారి ఆలయంతో పాటు భక్తులకు రక్షణ కల్పించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. రక్షణ వ్యవస్థలోని అధునాతన పద్ధతులను అవగాహన చేసుకోవడం ద్వారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అరికట్టవచ్చన్నారు. తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ హైదరాబాదు నుండి ఇంటెలిజెన్స్‌ అధికారులు, సిసి కెమెరాల నిపుణులను రప్పించి మెళకువలు నేర్పిస్తున్నట్టు వివరించారు. శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న అంశాలను రోజువారీ విధుల్లో ఆచరణలో పెట్టాలని, అప్పుడే సత్ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. అనంతరం శిక్షణలో భాగంగా నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన సెక్యూరిటీ గార్డులకు బహుమతులు, శిక్షణ తరగతుల్లో పాల్గొన్న సిబ్బంది ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.    
 
ఈ కార్యక్రమంలో తితిదే విజిఓ శ్రీ హనుమంతు, శ్వేత డైరెక్టర్‌ శ్రీ రామకృష్ణ, రిటైర్డ్‌ డీఎస్పీ శ్రీ నారాయణస్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.
           
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.