TTD EO PRESENTS SILK VASTRAMS TO SRISAILAM _ శ్రీశైల మల్లన్నకు శ్రీవారి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు

Tirupati, 22 February 2025: On behalf of Tirumala Sri Venkateswara Swamy, TTD EO Sri J. Syamala Rao, presented silk vastrams to Srisailam temple on the occasion of Sri Bhramaramba sameta Mallikarjuna Swamy annual Brahmotsavam on Saturday evening.

Speaking on this occasion, TTD EO said that during the Sivaratri Brahmotsavam held in Srisailam, it is customary to present silk clothes on behalf of TTD.  

Besides Vemulawada,  vastrams are being presented to Srikalahasti, Suruttupalli, Yaganti, Mahanandi also.  

Meanwhile the annual fest which commenced on 19th February will be celebrated till 1st March.

Earlier, Srisailam Temple EI Sri M.Srinivasa Rao and the priests welcomed the TTD EO.  Later, the temple authorities arranged Darshan and presented Tirtha Prasadams.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీశైల మల్లన్నకు శ్రీవారి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు

తిరుపతి, 2025 ఫిబ్రవరి 22: శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు శ‌నివారం సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ, శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శ్రీశైలంతోపాటు వేములవాడ, శ్రీకాళహస్తి, సురుటుపల్లి, యాగంటి, మహానంది తదితర శైవాలయాలకు టిటిడి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. 1996 నుండి టిటిడి తరుపున శ్రీ మల్లికార్జున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నట్లు మాట్లాడారు. ఫిబ్ర‌వ‌రి 19న ప్రారంభ‌మైన బ్ర‌హ్మోత్స‌వాలు మార్చి 1వ తేదీ వ‌ర‌కు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి.

ఆలయం వద్దకు చేరుకున్న ఈవో శ్రీ జె శ్యామల రావు కు శ్రీ‌శైలం ఆలయ ఈవో శ్రీ ఎం.శ్రీనివాస రావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. అనంత‌రం ఆలయ అధికారులు వీరికి తీర్థ, ప్రసాదాలు అందించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.