TTD EO REVIEWS ON SV ANNA PRASADAM TRUST ACTIVITIES _ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టు కార్య‌క‌లాపాల‌పై టిటిడి ఈవో స‌మీక్ష

Tirupati, 8 Sep. 20: TTD Executive Officer, Sri Anil Kumar Singhal on Tuesday reviewed the activities of the SV Anna Prasadam Trust in his chambers at the TTD administrative building on Tuesday.

He said during the lockdown period 35.45 lakh food packets, worth ₹3.08 crore were distributed among migrant labour, poor and needy of Tirupati and stranded pilgrims.

TTD officials informed that the Trust so far has 5,68,421 donors of which 21,732 donors had contributed Rs27 crore during the lockdown period.

They told the EO that the trust had supplied grocery and other materials worth around one crore to the Chittoor district administration for facilitating 5000 patients every day at the Covid Care Centres at Tirupati.

The EO directed the officials concerned to consider the proposals to provide Anna Prasadam in TTD temples located at other regions like Rishikesh during prominent festivals like Brahmotsavams, as is being done at Tirumala and Tirupati. 

Additional EO Sri A V Dharma Reddy, JEO Sri P Basant Kumar, CE Sri M Ramesh Reddy, FACAO Sri O Balaji, Additional FACAO Sri Ravi Prasadu, Dyeo of Anna Prasadam Sri Nagraj participated in the review meeting.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టు కార్య‌క‌లాపాల‌పై టిటిడి ఈవో స‌మీక్ష
 
తిరుపతి, 2020 సెప్టెంబరు 08: శ్రీ వేంక‌టేశ్వ‌ర అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టు కార్య‌క‌లాపాల‌పై టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మంగ‌ళ‌వారం తిరుప‌తి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని త‌న‌ కార్యాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించారు.
 
లాక్‌డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స‌కూలీలు, పేద‌ల‌కు 35.45 ల‌క్ష‌ల అన్న‌ప్ర‌సాదం పొట్లాలు పంపిణీ చేసిన‌ట్టు అధికారులు తెలిపారు. ఇందుకు గాను రూ.3.08 కోట్లు ఖ‌ర్చు అయిన‌ట్టు చెప్పారు. అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు ఇప్పటివరకు 5,68,421 మంది దాత‌లు ఉన్నార‌ని, ఇందులో కోవిడ్ లాక్ డౌన్  స‌మ‌యంలో 21,732 మంది దాత‌లు రూ.27 కోట్లు విరాళంగా అందించిన‌ట్టు అధికారులు తెలిపారు. తిరుప‌తిలోని కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌లో రోజుకు 5 వేల మంది క‌రోనా బాధితుల‌కు ఆహారం అందించ‌డానికి అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టు ద్వారా దాదాపు ఒక కోటి రూపాయ‌ల స‌రుకులు జిల్లా యంత్రాంగానికి అంద‌జేసిన‌ట్టు అధికారులు ఈవోకు తెలియ‌జేశారు. తిరుమ‌ల‌, తిరుప‌తి కాకుండా ఇత‌ర ప్రాంతాల్లో ఉన్న రిషికేష్ లాంటి టిటిడి ఆల‌యాల్లో బ్ర‌హ్మోత్స‌వాలు, ఇతర విశేష ఉత్సవాల స‌మ‌యంలో అన్న‌ప్ర‌సాదం పంపిణీ చేసే ప్ర‌తిపాద‌న‌ను ప‌రిశీలించాల‌ని అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టు అధికారులకు ఈవో సూచించారు.
 
ఈ స‌మీక్ష‌లో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ ఎం.ర‌మేష్‌రెడ్డి, ఎఫ్ఏ సిఏవో శ్రీ ఓ.బాలాజి, అద‌న‌పు ‌ఎఫ్ఏ సిఏవో శ్రీ ర‌విప్ర‌సాదు, అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టు డెప్యూటీ ఈవో శ్రీ నాగ‌రాజ పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.