TTD EO TAKES OATH AS EX-OFFICIO MEMBER OF TTD BOARD _ టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా టీటీడీ ఈవో ప్రమాణ స్వీకారం
Tirumala, 17 November 2024: TTD EO Sri J. Syamala Rao took oath as ex-officio member of TTD Board at Tirumala Srivari Temple on Sunday.
The Additional EO Sri Ch. Venkaiah Chowdary administered the oath to him at the Bangaru Vakili in front of the presiding deity in Tirumala Temple.
After the EO had darshan of Srivaru, Vedic scholars rendered Vedaseervachanam at Ranganayakula Mandapam.
Later, the Additional EO offered Srivari Tirtha Prasadams and a laminated picture of Srivaru.
Speaking to the media on this occasion in front of the temple, the EO said that taking oath as an ex-officio member of the Board is a sacred opportunity given by Srivaru. He thanked the Chief Minister of AP Sri Nara Chandrababu Naidu for providing this much coveted opportunity.
He said that many good programs have been taken up in TTD in the last five months.
He said steps have been taken to provide facilities to common devotees, improve the quality of Anna Prasadam and Laddu Prasadam.
He said that this year’s Brahmotsavam was organized with great splendour with the blessings of Srivaru.
He also said that steps have been taken to control the middlemen menace in Tirumala.
Later the EO informed that more good programs will be taken up by the TTD board in the future as well.
Deputy EOs Sri Lokanatham, Sri Bhaskar, temple Peishkar Sri Ramakrishna and others participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా టీటీడీ ఈవో ప్రమాణ స్వీకారం
తిరుమల, 2024 నవంబరు 17: టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈవో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అడిషనల్ ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆలయం ముందు ఈవో మీడియాతో మాట్లాడుతూ బోర్డు సభ్యునిగా ప్రమాణస్వీకారం చేయడం శ్రీవారు ఇచ్చిన పవిత్రమైన అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. గత ఐదు నెలలుగా టీటీడీలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. సామాన్య భక్తులకు సౌకర్యాల కల్పన, అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
శ్రీవారి ఆశీస్సులతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. తిరుమలలో దళారులను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా టీటీడీ బోర్డు ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ శ్రీధర్, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, వీజీవో శ్రీ సురేంద్ర, పేష్కార్ శ్రీ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.