TTD EO TAKES OATH AS EX-OFFICIO OF TRUST BOARD _ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యకార్యదర్శిగా డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ప్రమాణస్వీకారం
ADDITIONAL EO ADMINISTERS OATH OF OFFICE TO EO
TIRUMALA, 24 SEPTEMBER 2021: The Executive Officer of Tirumala Tirupati Devasthanams (TTD), Dr KS Jawahar Reddy, took oath as an ex-officio member of the newly formed TTD Trust Board in Srivari temple at Tirumala on Friday.
The Additional EO of TTD Sri AV Dharma Reddy administered the oath of office with the EO at Bangaru Vakili at 10:05am in front of Sri Venkateswara Swamy.
After the darshan of Srivaru, the EO was rendered Vedasirvachanam at Ranganayakula Mandapam. Later he was presented with Theertha Prasadams, a lamination photo and a Coffee Table book of Sri Venkateswara Swamy.
JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, Deputy EOs Sri Ramesh Babu, Sri Lokanatham, Smt Sudharani and others were also present.
Later, speaking to the media persons outside the temple, the EO said, as the annual brahmotsavams at Tirumala temple are scheduled from October 7 to 15, the arrangements for the same are underway. “In view of Covid pandemic, the annual fete will take place in Ekantam. The Honourable Chief Minister Sri YS Jaganmohan Reddy will be invited for the mega festival”, he maintained.
The EO said, TTD, as declared earlier, will develop the Hanuman Janmasthalam in Anjanadri. “To popularise the new Sankeertans of Tallapaka Sri Annamacharya which were brought to light byTTD, the competitions to the youth will be held across AP in October. To start with from the youth of Chittoor district on October 24 and 25 which will be recorded in SVBC studio at Tirupati”, he maintained.
INSPECTION BY EO
Later, the EO along with Additional EO and CVSO inspected the Brahmotsavam arrangements in Tirumala on Friday.
As a part of it, he inspected the entry and exit lines near the temple, sanitation, electrical illumination arrangements and ongoing civil works. He later directed the officials concerned to complete the same as per the time schedule.
CE Sri Nageswara Rao, EEs Sri Jaganmohan Reddy, Sri Ravishankar Reddy, VGO Sri Bali Reddy and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి ధర్మకర్తల మండలి సభ్యకార్యదర్శిగా డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ప్రమాణస్వీకారం
తిరుమల, 2021 సెప్టెంబరు 24: టిటిడి ధర్మకర్తల మండలి సభ్యకార్యదర్శిగా డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఉదయం 10.05 గంటలకు టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో బోర్డు సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అదనపు ఈఓ అందించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్ బాబు, శ్రీమతి సుధారాణి, శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.
అనంతరం ఆలయం వెలుపల ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 7 నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తామని, ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. కోవిడ్ మార్గదర్శకాల మేరకు ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తామన్నారు. ఇదివరకు ప్రకటించినట్టుగానే అంజనాద్రిలో హనుమాన్ జన్మస్థలాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. నూతనంగా బాణీలు కట్టిన అన్నమయ్య సంకీర్తనలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా అక్టోబరులో రాష్ట్రవ్యాప్తంగా యువతకు పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. అక్టోబరు 24, 25వ తేదీల్లో చిత్తూరు జిల్లాలోని యువతకు పోటీలు నిర్వహిస్తామని, తిరుపతిలోని ఎస్వీబీసీ స్టూడియోలో వీటిని రికార్డు చేస్తామని తెలిపారు.
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలన
ఆ తరువాత అదనపు ఈవో, సివిఎస్వోతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈవో పరిశీలించారు. ఆలయంలో భక్తుల ప్రవేశించే, వెలుపలికి వచ్చే క్యూలైన్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ అలంకరణ ఏర్పాట్లు, సివిల్ పనులను తనిఖీ చేశారు. నిర్దేశిత సమయంలోపు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు.
ఈవో వెంట చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఇఇలు శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీ రవిశంకర్‌రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి తదితరులు ఉన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.