TTD FULL SUPPORT TOWARDS THE GROWTH OF SP MAHILA UNIVERSITY _ శ్రీవారి దయతోనే తిరుపతి లో మహిళ విశ్వవిద్యాలయం
– TTD CHAIRMAN AT INAUGURATION OF NEW BUILDING & AUDITORIUM
Tirupati, 31 December 2021: The TTD Chairman Sri YV Subba Reddy said on Friday that the SP Women’s University came into being in Tirupati with the blessings of Sri Venkateswara and TTD is fully committed in extending all support for its growth.
The TTD chairman inaugurated the newly built KL Rao Bhavan, auditorium livelihood business incubator, Medicinal Plant Park, and Centre for women safety in the university complex.
Addressing on the occasion he said TTD had given 130 acres and an annual grant of Rs.1 crore besides construction of Sri Padmavati temple at a cost of Rs 20 lakhs for benefit of students in the varsity.
He said womanhood is root cause of a healthy society and she is the fulcrum of power, sustainable growth and quality of education is being promoted at the university due to the best contributions of Vice-chancellor Prof Jamuna, Registrar Prof Mamata and other faculty members.
He said he is glad to inaugurate the Building of Engineering College, classrooms and auditorium in the country’s second woman’s university
He said the fee reimbursement scheme introduced by former AP CM Sri YS Rajasekhar Reddy has helped many poor students to become doctors and engineers and settle in professional courses. He lauded the efforts of the university administration for remodelling the university auditorium as per technical demands of growing trends of the student community.
He said the Union micro, small and medium institutions ministry had granted Rs.98.8 lakhs for project to benefit 600 students to get training in capacity building skills and transforming them into entrepreneurs.
He said he is happy to learn that the students and women are being trained in bakery products, mushroom cultivation, embroidery and conventional food products to become self-employed.
He also inaugurated the medicinal biodiversity park, herbal plant garden comprising of various medicinal herbs and plants sanctioned by the National Medicinal Plants Board and Union Ayush Ministry.
He said the Sri Padmavati Mahila University and AP police department have jointly proposed in January 2021 to set up E- Centre for Street Rakshana and promoting awareness on laws for the protection of women and also regulations to protect women from atrocities and harassment.
University Vice-Chancellor Prof. Jamuna, Registrar Prof Mamta, SVIMS deemed University Vice-Chancellor Dr Vengamma, IIT Director Prof Satyanarayana, Director School of Technology Prof Ramakrishna and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి దయతోనే తిరుపతి లో మహిళ విశ్వవిద్యాలయం
– విశ్వవిద్యాలయం అభివృద్ధి కి టీటీడీ ఇతోధిక సహాయం
– నూతన భవనం, ఆడిటోరియం ప్రారంభ సభలో టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
తిరుపతి 31 డిసెంబరు 2021: తిరుపతి లో మహిళలకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు అయ్యిందంటే అది శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయే నని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. మహిళ విశ్వవిద్యాలయం అభివృద్ధికి టీటీడీ ఇతోధిక సహాయం అందిస్తోందని అన్నారు.
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లో నూతనంగా నిర్మించిన కెఎల్ రావు భవనాన్ని, ఆడిటోరియం, లైవ్లీ హుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్, మెడిసినల్ ప్లాంట్ పార్క్ , సెంటర్ ఫర్ ఉమెన్ సేఫ్టీ లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, మహిళ విశ్వవిద్యాలయం నిర్మాణానికి టీటీడీ 130 ఎకరాల భూమి అందించిందన్నారు. దీంతో పాటు ఏటా కోటి రూపాయల గ్రాంట్ అందిస్తోందన్నారు. రూ 20 లక్షలతో యూనివర్సిటీ ఆవరణం లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మిస్తున్నామని, ఈ ఆలయం త్వరలో భక్తులకు, విద్యార్థినులకు అందుబాటులోకి వస్తుందని ఛైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి వివరించారు.
సృష్టికి మూలం స్త్రీ, స్త్రీ లేకుండా సమాజం లేదన్నారు. సంపూర్ణ ప్రేమ తత్వంలో ఆమె ” శక్తి ” గా అవతరించిందని చెప్పారు.
అలాంటి స్త్రీ మూర్తులందరికి సంపూర్ణంగా, నిండుగా విద్యను అందిస్తూ, సమాజ ఉన్నతికి, తోడ్పడుతున్న శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ. జమున రిజిస్ట్రార్ ప్రొ. మమత, ఇతర అధ్యాపకులు, సిబ్బందిని అభినందించారు.
ఇంజినీరింగ్ కళాశాలలోని భవన సముదాయంలో తరగతి గదులు, ఆడిటోరియం ప్రారంభించడం అభినందనీయమన్నారు.
500 మంది విద్యార్థినులు కూర్చున గలిగే సదుపాయాలతో ఈ ఆడిటోరియం నిర్మించారని చెప్పారు. గత రెండున్నర సంవత్సరాలుగా విశ్వవిద్యాలయం ఎంతో అభివృద్ధి చెందు తోందన్నారు. దేశంలో ఇది రెండవ మహిళ విశ్వవిద్యాలయమని ఆయన చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారని చెప్పారు.
మారుతున్న కాలానికి తగిన విధంగా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఆడిటోరియం కు రూపకల్పన చేసిన శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం పరిపాలన విభాగాన్ని శ్రీ సుబ్బారెడ్డి అభినందించారు.
భారత ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు రూ. 98.8 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 600 మంది విద్యార్థులకు సంవత్సరం పాటు నైపుణ్య శిక్షణ ఇస్తారని, తద్వారా వారు సొంతంగా ఉపాధిని పొందడం దీని ముఖ్య ఉద్ధేశమని ఆయన తెలిపారు
ఇందులో విద్యార్థినులతో పాటు, ఇతర మహిళలకు బేకరీ ఉత్పత్తుల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, ఎంబ్రాయిడరీ, సాంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేయడం నేర్పించడం సంతోషకరమని చెప్పారు. శిక్షణ అనంతరం వీరు ఆర్థికంగా ఎదగడానికి స్వయం ఉపాధి మార్గాలు ప్రారంభిచుకునే వీలు కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అదే విధంగా నేషనల్ మెడిసనల్ ప్లాంట్ బోర్డు , భారత ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖవారిచే ఆమోదించబడిన వివిధ ఔషద గుణములు ఉన్న మొక్కల సమ్మేళనంతో ఏర్పాటు చేసిన హెర్భల్ ప్లాంట్ గార్డెన్, మెడిసినల్ బయోడైవర్సిటి పార్క్ కూడా ప్రారంభించడం సంతోషకరని చెప్పారు.
శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం మరియు ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ సంయుక్తంగా ” స్త్రీ రక్షణ ” కు జనవరి – 2021న ఈ – సెంటర్ ఏర్పాటుకు రూపకల్పన చేశారన్నారు. ఇందులో స్త్రీ రక్షణ, స్త్రీలపై హింసను అరికట్టడానికి సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించడం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పారు.
ఇలాంటి చక్కటి కార్యక్రమాల నిర్వహణలో యూనివర్సిటీ మరింత ముందుకు సాగాలని శ్రీ సుబ్బారెడ్డి ఆకాంక్షించారు.
యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జమున, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మమత, స్విమ్స్ దీమ్డ్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెంగమ్మ, ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణడైరెక్టర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజి ప్రొఫెసర్ రామకృష్ణ ,డీన్ ప్రొఫెసర్ నాగరాజు, ఈ ఈ శ్రీ శ్రీనివాసులు, ప్రొఫెసర్ జీవన జ్యోతి, ప్రొఫెసర్ సుజాత, డాక్టర్ రజని,
పిఆర్వో ప్రొఫెసర్ రజని, ప్రొఫెసర్ ద్వారం లక్ష్మి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది