TTD FUNDS DEPOSITED IN BANKS IN A TRANSPARENT WAY – EO_ టిటిడి నిధులను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే బ్యాంకులలో డిపాజిట్‌ చేశాం -టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 2 Apr. 18: TTD Executive Officer Sri Anil Kumar Singhal ruled out any violation of rules in making deposits of TTD funds in Banks at loss of interest.

In the wake of violation allegations made by a section of media over TTD funds deposited in Banks, EO convened a press conference in Conference Hall of TTD Administrative Building in Tirupati on Monday evening and clarified on the issue saying that no violation took place and the entire process was carried out in a transparent manner.

Elaborating on the procedure followed by TTD in depositing TTD funds in banks, EO said, the Vijaya Bank has quoted the rate of interest @ 7.27% in the first instance and again in the sealed quotation they have maintained the same rate even in improved rates. The Andhra Bank has quoted 7.00% initially and has improved their rate to 7.32%.

In the circumstances, the deposits of Rs.3000Crores were made with highest rate of interest quoted by Andhra Bank in a transparent way.

Elaborating further, the EO said, in the back drop of drastic interest reduction in PSUs, the investment committee experts have advised TTD to invest in Government approved (Vide GO.Ms.No.124) selective private banks. The selection was made by the Investment committee on the basis of health of the bank. The committee also suggested that, the investment also should not exceed more than 10 percent of the total investment portfolio in each private sector bank.

In this regard, the IndusInd Bank has quoted highest rate at 7.66 percent for callable deposits and an amount of Rs.1000Cr were invested with them.

“The total procedure followed was transparent and there is absolutely no violation of procedures, rules, regulations. Government orders were followed in these Re-investments made in a transparent manner”, EO asserted.

FACAO Sri O Balaji was also present in the press meet.

(Sealed bid quotations enclosed herewith)

Sealed bid quotations were called for quoting the rate of interest which was opened on 24.03.2018. The rates of interest offered by banks were as follows:

Sl. No. Name of the Bank 1 (One) Year
Above 1 Crore
1) Vijaya Bank 7.27%
(for 3000 Cr. around)
2) Syndicate Bank
7.05%
3) State Bank of India
7.01%
4) Andhra Bank 7.00% Plus
Negotiable
5) Sapthagiri Grameena Bank
7.15%

6) Bank of Baroda
6.50% (1 Cr. to 10 Cr.)
6.75% (10Cr. to 50 Cr.)
6.90%(50 Cr.to 100 Cr.)
7.00%(100 Cr.)
7) Bank of India 5.85%
(10 Cr. to 100 Cr.)
5.60%
(100 Cr. to above 200 Cr. for 1 year and less than 2 years)
8) Union Bank of India 6.75% (1000 Cr.)
9) Indian Bank 6.50%

The following banks were given the improved rates as follows and the revised quotations were opened on 26.03.2018.
Name of the Bank Initial rate quoted Improved Rate
Vijaya Bank 7.27% 7.27%
Syndicate Bank 7.05% 7.11%
Andhra Bank 7.00% 7.32%


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి నిధులను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే బ్యాంకులలో డిపాజిట్‌ చేశాం -టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2018 ఏప్రిల్‌ 02: శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పారదర్శకంగా బ్యాంక్‌లలో డిపాజిట్‌ చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పష్టంచేశారు. టిటిడి నిధులను వివిధ బ్యాంక్‌లలో జమచేయడంపై వచ్చిన ఆరోపణలలో వాస్తవంలేదన్నారు. తిరుతిలోని టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మార్గదర్శకాలు, ఇన్వెస్ట్‌మెంట్‌ కమిటీ నూచనలను అనుసరించి ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల జాబితా ప్రకారం వచ్చిన సీల్డ్‌ బిడ్‌ కొటేషన్లను మార్చి 24వ తేది పరిశీలించామన్నారు. వచ్చిన కొటేషన్లను పరిశీలించి మరింత మెరుగైన వడ్డీ రేట్లను కోరుతూ మార్చి 26వ తేదీన మరోసారి బ్యాంకుల నుండి వచ్చిన సీల్డ్‌ బిడ్‌ కొటేషన్లను పరిశీలించినట్లు తెలియజేశారు. నిబంధనలను పాటిస్తూ టిటిడికి అత్యధిక శాతం వడ్డి ఇవ్వడానికి అంగీకరించిన బ్యాంకులలో మాత్రమే జమ చేశామన్నారు.

ఇన్వెస్ట్‌మెంట్‌ కమిటి మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి వడ్డీల రూపంలో వచ్చే రూ.4 వేల కోట్లలో రూ.3 వేల కోట్లను ప్రభుత్వరంగ బ్యాంకులలోనూ, రూ.1000 కోట్లను ప్రైవేట్‌ బ్యాంక్‌లలో డిపాజిట్‌ చేయాల్సి ఉందన్నారు. అందులోభాగంగా విజయా బ్యాంక్‌ 7.27 శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ 7.11 శాతం, ఆంధ్రా బ్యాంక్‌ 7.32 శాతం వడ్డీని ఇవ్వడానికి అంగీకరించిందన్నారు. అధిక వడ్డీని ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఆంధ్రా బ్యాంక్‌లో రూ.3,000 కోట్లు (7.32 శాతం వడ్డ్డీకి), ఇండసిండ్‌ బ్యాంక్‌లో రూ.1,000 కోట్లను (7.66 శాతం) డిపాజిట్‌ చేశామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 10,589 కోట్లు టిటిడి నిధులను వివిధ బ్యాంకులలో డిపాజిట్‌ చేశామన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.