PREPARE AN ACTION PLAN TO COMPLETE PENDING WORKS IN TIRUMALA-TTD EO_ తిరుమలకు విచ్చేసే భక్తులకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 2 April 2018: The engineering wing should come out with an action plan with respect to various works pending with different cottages and rest houses in Tirumala and should complete them as per the time schedule, said TTD EO Sri Anil Kumar Singhal.

The senior officers meeting was held at Conference Hall in TTD Administrative building in Tirupati on Monday. The EO reviewed on the progress of various works under way in different departments. He instructed the engineering officials to take up cottage monitoring regularly and solve the civil, electrical issues without delay.

To avoid the frequent fire mishaps in Boondi Potu, he directed the concerned to take experts advice to over come the issue and adopt advanced cleaning techniques if any.

The EO directed the electrical wing of TTD to set up noiseless fans in Srivari temple at Tirumala.

Later he instructed the IT Wing and TCS team to make necessary amendments in the Srivari Seva on line application and include the area of choice of service before April 10.

To enhance aesthetic atmosphere in Alipiri and Srivari Mettu footpath routes, he directed the concerned to grow green plants all along the paths. Later he also instructed to streamline the road from Gokulam to Narayanagiri queue lines.

JEOs Sri KS Sreenivasa Raju, P Bhaskar, FACAO Sri O Balaji, CE Sri C Chandrasekhar Reddy and others senior officers were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలకు విచ్చేసే భక్తులకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2018 ఏప్రిల్‌ 02: కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు మరింత ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుతిలోని టిటిడి పరిపాలన భవనంలో మీటింగ్‌హాల్‌ నందు సోమవారం ఉదయం ఆయన సీనియర్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిచారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల రింగ్‌రోడ్లకు ఇరువైపుల, ప్రధాన కూడళ్లలోపూల మొక్కలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలలో పచ్చదనాన్ని పెంపొందించేెందుకు, మొక్కలను కాపాడుటకు డ్రిప్‌ పైపుల ద్వారా నీటిని పంపేందుకు అటవీ విభాగం అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల ఆధ్యాత్మికతకు భంగం కలుగకుండా శబ్దంరాని ఫ్యాన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందిపోటును శుభ్రం చేసే షెడ్యుల్‌ను సిబ్బందితో చర్చించి అగ్ని ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అఅధికారులను ఆదేశించారు. అదేవిధంగా బూందిపోటులో అగ్ని ప్రమాదాలు జరుగకుండా నిపుణుల సూచనలు తీసుకోవాని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

తిరుమలలోని కాటేజీలు, అతిధి గృహాలలో పెండింగ్‌లో ఉన్న ఇంజినీరింగ్‌ పనులుపూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. కాటేజీల నిర్వాహణలో క్రమం తప్పకుండా పరిశీలించి ఫ్లోరింగ్‌, ట్యాప్స్‌, పెయింటింగ్‌ మరమ్మత్తులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీవారి సేవకులు టిటిడిలో తమకు నచ్చిన విభాగాలలో సేవలందించేందుకు రూపొందిస్తున్న ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను ఏప్రిల్‌ 10వ తేది లోపల పూర్తి చేయాలని ఐటి అధికారులను ఆదేశించారు. క్యూలైన్లను క్రమబద్దీకరించడంలో భాగంగా గోకులం నుండి నారాయణగిరి ఉద్యానవనాల వరకు గల రోడ్డును వెడల్పు చేసే అంశాన్ని పరిశీలించాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ, ఎఫ్‌ఎ అండ్‌ సిఏవో శ్రీ బాలాజీ, సిఇ శ్రీ చంవ్రశేఖర్‌రెడ్డి, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.