TTD INTENSIFIES PUBLICITY ON PLASTIC BAN IN TIRUMALA _ తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధానికి భక్తులు సహకరించాలి : టిటిడి ఆరోగ్య విభాగం అధికారి డాక్టర్.ఆర్.ఆర్.రెడ్డి
Tirumala, 12 Apr. 21: As a part of its mission of environment protection in Tirumala, TTD has taken up a ban on plastic usage in the hill town since January last. To attain a cent per cent plastic ban in Tirumala, TTD has intensified its publicity.
On Monday, under the aegis of Dr RR Reddy, Health Officer of TTD, awareness rallies were organized at Alipiri Toll Gate, Kalyanakatta and other important junction points.
The employees, locals and pilgrims are being told to completely ban the usage of plastic bottles and instead use glass bottles in its place.
Some of the key guidelines on plastic ban:
Devotees walking along both footpath routes are requested not to carry plastic bottles
They are also sought not to throw plastic covers and other related items in the ghats
All the shopkeepers residing are also directed not to sell items in plastic covers
Reusable bottles are being encouraged
Every day, the Health wing divides into two teams and educates pilgrims trekking along both footpaths and also clears the plastics if any immediately.
In Tirumala, RO water is available at all the 88 Jalaprasadam units. Every day nearly 4.44lakh litres of water are being filtered through water filters and devotees shall consume these waters avoiding carrying plastic water bottles.
Even in all the shops at Tirumala, glass water bottles are available
The replacement of plastic laddu covers with jute bags and biodegradable compost covers has gained an immense response from pilgrims.
Similar manner, the devotees are requested to discard the usage of plastic water bottles and co-operate with the decision of TTD to make Tirumala a safe Plastic Free Zone.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధానికి భక్తులు సహకరించాలి : టిటిడి ఆరోగ్య విభాగం అధికారి డాక్టర్.ఆర్.ఆర్.రెడ్డి
తిరుమల, 2021 ఏప్రిల్ 12: ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలలో పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు సంపూర్ణంగా ప్లాస్టిక్ నిషేధించేందుకు భక్తులు సహకరించాలని టిటిడి ఆరోగ్య విభాగం అధికారి డాక్టర్.ఆర్.ఆర్.రెడ్డి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తిరుమలలో ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్‌ల నిషేధంపై గత ఏడాది అక్టోబర్ 19వ తేదీ నుండి భక్తులకు అవగాహన కల్పిస్తున్న విషయం విధితమే.
ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ప్లాస్టిక్ రహిత సప్తగిరులుగా తీర్చిదిద్ధాడానికి తిరుమలకు విచ్చేసే యాత్రికులు, ఉద్యోగులు, స్థానికులు, వ్యాపార సంస్థలకు అవగాహన కల్పించడానికి సోమవారం ఉదయం అలిపిరి టోల్‌గేట్, తిరుమలలోని కల్యాణ కట్ట, ప్రధాన కూడళ్ళ వద్ద సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధంపై ఆరోగ్య విభాగం సిబ్బంది విస్తృత ప్రచారం చేపట్టారు.
ఇందులో భాగంగా –
– అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలు, రెండు ఘాట్ రోడ్లలలో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా భక్తులు సహాకరించాలి.
– తిరుమలలోని అన్ని వ్యాపార సంస్థలు ప్లాస్టిక్ బ్యాగులు, కవర్లలలో ఏ వస్తువులు అమ్మకూడదు.
– ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌లను తీసుకురాకుడదని యాత్రికులకు అవగాహన కల్పించాలి.
– పునర్వినియోగ బాటిళ్లను తీసుకురావడానికి / వాడటానికి వారిని ప్రోత్సహించాలి,
– ప్రతి రోజు ఉదయం ఆరోగ్య విభాగం సిబ్బంది బృందాలుగా ఏర్పాడి తిరుమలకు వచ్చే అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలు, రెండు ఘాట్ రోడ్లలను సందర్శించి ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తారు.
– ప్రతిరోజూ తిరుమలలో 32 ఎంజి / 144 లక్షల లీటర్లు నీటిని ఫిల్టర్‌ల ద్వారా శుభ్రం చేసి సురక్షితమైన తాగునీరుగా మార్చి తిరుమలలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేయబడుతోంది.
– తిరుమలలోని వివిధ ప్రాంతాలలో 88 ఆర్ ఒ వాటర్ ప్లాంట్లలలో రోజుకు 4.44 లక్షల లీటర్ల తాగునీరు భక్తులకు అందుబాటులో ఉంటుంది. భక్తులు వీటిని సద్వినియోగం చేసుకుని ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వినియోగం తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలి.
– తిరుమలలోని అన్ని దుకాణాల్లో గాజు వాటర్ బాటిల్‌లు అందుబాటులో ఉన్నాయి.
తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా శ్రీవారి ప్రసాదాలను తీసుకెళ్ళేందుకు ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లకు బదులు, నాణ్యమైన జూట్ బ్యాగులు, బయోడిగ్రేడబుల్ కంపోస్ట్ కవర్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. వీటికి ఇప్పటికే భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.