TTD IS A ROLE MODEL IN TEMPLE ADMINISTRATION IN THE ENTIRE COUNTRY – ADDITIONAL EO _ దేశంలోని ఆలయాలకు టిటిడి పాలన ఆదర్శం: టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి

OUR DARSHAN MANAGEMENT SYSTEM IS WELL-DESIGNED AND  EXECUTED 

MAJOR PART OF  DARSHAN TIME IS FOR COMMON PILGRIMS

ADDITIONAL EO

TIRUMALA, 18 FEBRUARY 2025: For all the temples across the country, the Hill Shrine Tirumala managed by Tirumala Tirupati Devasthanams (TTD) is a role model, advocated the Additional EO of TTD Sri Ch Venkaiah Chowdary.

During his speech session on the second day evening of the ongoing three day International Temple Convention Expo(ITCX)at Asha Convention in Tirupati on Tuesday evening, the Additional EO has given an entire picture of TTD, its history, Darshan Management, work force, various institutions being operated under its auspices, Trusts and other activities in his 35minute empowering speech which impressed the invitees.

The Additional EO highlighted a few focal points that includes:

Average footfall to Tirumala in a year at 2.50cr

A well-designed waiting and queue line system with 63 compartments as waiting halls that accommodates around 28thousand pilgrims round the clock food and sanitation facilities

Major part of darshan time in a day allotted for common pilgrims

On weekdays the general darshan time lasts for nearly 12-14hours while on Saturdays and Sundays over 15-17hours.

He said darshan plan changes based on the situation of pilgrim count to provide comfortable darshan to the pilgrims

Over 7600 rooms and PACs that accommodates around 60thousand pilgrims

On an average 80thousand pilgrims are provided Annaprasadam in Tirumala every day

Three kitchens to cater to the needs of pilgrims

Ten varieties of Srivari Prasadams and 3.5lakh laddu prasadams made available to pilgrims every day

The additional EO elaborated that besides manning the pilgrim crowd, TTD also carries out various Dharmic-Socio-welfare activities. ”TTD is not just confined to temple administration but we are into multi-fold welfare activities”, he maintained.

Dharmic

Annamacharya, Dasa Sahitya, Alwar Divyaprabandha, Hindu Dharma Prachara and many other projects to take forward Sanatana Dharma across the country through wide range of programs 

Sri Venkateswara Bhakti Channel in Telugu, Tamil, Kannada and Hindi

Sapthagiri religious monthly magazine in six languages

Medical

14 hospitals and dispensaries

Sanitation

1914 sanitary workers every day, 207 toilet blocks, 4. 5sq.km cleaning, 90tons garbage every day

Transport

Free transportation through Dharma Rathams in Tirumala 

1600 RTC buses ply between Tirupati and Tirumala and vice versa everyday

2400 RTC buses during special occasions 

Education

35 educational institutions with nearly 20thousand pupils 

Vedic institutions 

Religious

Guarding 61 temples across the country

04 Gosamrakshana Shalas

08 Trusts including Vedic and Heritage Preservation 

Workforce

7000 Regular

17500 outsourcing 2500 Srivari Seva Volunteers as a helping hand in offering services to pilgrims

1250 Vigilance and Security 

Social activities 

SV Poor Home for Leper patients, Karunadhamam for aged and abandoned, SV Balamandiram-

Orphanage school, Deaf and Dumb School, Polytechnic college for specially able students

Concluding his speech the Additional EO asserted besides all the above activities TTD is marching ahead with the Digitization of all its services and in the coming 2-3years would achieve 100% in its IT activities with an intention to provide transparent facilities to the scores of devotees amidst grand applause from the audience.

Sri Giresh Vasudev Kulkarni, Founder – ITCX, Temple Connect, Sri Prasad Lad, Chairman, ITCX 2025 and Chief WHIP of Maharashtra Legislative Council later felicitated the Additional EO of TTD with the laminted photo of Sri Venkateswara Swamy.

TTD JEO Sri Veerabrahmam, VC of Vedic University Sri Rani Sadasiva Murty, HDPP Secretary Sri Sriram Raghunath, Chief PRO Dr T Ravi and others on behalf of TTD were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

దేశంలోని ఆలయాలకు టిటిడి పాలన ఆదర్శం: టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి

శ్రీవారి దర్శన నిర్వహణ, అమలు వ్యవస్థ పటిష్టంగా ఉంది


శ్రీవారి దర్శనంలో అధిక శాతం సాధారణ భక్తుల కోసం కేటాయింపు

కేవలం రూ. 50/- లకే అత్యుత్తమ నాణ్యమైన వసతి

తిరుపతి, 2025, ఫిబ్రవరి 18: దేశంలోని అన్ని దేవాలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) నిర్వహణ ఆదర్శమని టిటిడి అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతిలోని ఆశా కన్వెన్షన్‌లో మంగళవారం సాయంత్రం జరుగుతున్న మూడు రోజుల అంతర్జాతీయ ఆలయ కన్వెన్షన్ ఎక్స్‌పో (ITCX)లో రెండవ రోజు సాయంత్రం అదనపు ఈవో 35 నిమిషాలపాటు టిటిడి చరిత్ర, పాలన, శ్రీవారి దర్శన నిర్వహణ, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, ఉద్యోగులు, సిబ్బంది, టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వివిధ సంస్థలు, ట్రస్టులు, ఇతర సేవల గురించి పూర్తి సమాచారాన్ని అందించారు, టిటిడి అందిస్తున్న సేవలపై చూపరులను, ఆహ్వానితులను ఆకట్టుకుంది.

అదనపు ఈవో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుమలకు సంవత్సరంలో సగటున 2.50 కోట్లు భక్తులు వస్తున్నారు.

టిటిడిలో 66 శాఖలు ద్వారా భక్తులకు విస్తృతంగా సేవలు

సరాసరి రోజుకు 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు

భక్తులకు నిరంతరం అన్నప్రసాదాలు, పారిశుధ్య సౌకర్యాలు తదితర సేవలు అందిస్తున్నాం

తిరుమలలో భక్తులు వేచియుండేందుకు 63 వెయిటింగ్ కంపార్ట్‌మెంట్‌లు

చక్కగా రూపొందించబడిన క్యూ లైన్ వ్యవస్థ

రోజులో ఎక్కువ శాతం సాధారణ భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు సమయం కేటాయించాం

భక్తులకు సాధారణ దర్శన సమయం దాదాపు 12 గంటలు, శనివారాలు మరియు ఆదివారాల్లో 17 గంటలకు పైగా ఉంటుంది.

భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, రోజువారీ వచ్చే భక్తుల సంఖ్య ఆధారంగా దర్శన ప్రణాళికలు మారుతుందన్నారు

సుమారు 60 వేల మంది యాత్రికులకు వసతి కల్పించే 7600 గదులు, 5 పీఏసీలు ఉన్నాయి

తిరుమలలో ప్రతిరోజూ సగటున 80 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నాం

భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు మూడు వంటశాలలు

ప్రతిరోజూ 3.5 లక్షల లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంచబడతాయి

శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు, పారిశుద్ధ్య సేవలు అందించటమే కాకుండా వివిధ ధార్మిక – సామాజిక-సంక్షేమ కార్యకలాపాలను కూడా టిటిడి నిర్వహిస్తుందని అదనపు ఈవో వివరించారు. ”టిటిడి కేవలం ఆలయ పరిపాలనకే పరిమితం కాదు, విస్తృత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.

దేశవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని విస్తృతంగా తీసుకెళ్లేందుకు
అన్నమాచార్య, దాస సాహిత్యం, ఆళ్వార్ దివ్యప్రబంధం, హిందూ ధర్మ ప్రచార మరియు ఇతర ప్రాజెక్టులు ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాం

తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషలలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్

ఆరు భాషలలో సప్తగిరి మాసపత్రిక

వైద్యం సేవలు

14 ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీలు

పారిశుధ్యం

ప్రతిరోజు 1914 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు, 207 టాయిలెట్ బ్లాక్‌లు ఉన్నాయి, ప్రతిరోజూ 90 టన్నుల వ్యర్థాల చెత్త ప్రోగు అవుతుంది

రవాణా

తిరుమలలో భక్తులకు ధర్మ రథం ద్వారా ఉచిత రవాణా అందిస్తున్నాం

తిరుపతి నుండి ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులు ద్వారా సాధారణ భక్తులు తిరుమల చేరుతున్నారు. దాదాపు 1600 ఆర్టీసీ బస్సులు సేవలందిస్తున్నాయి

ప్రత్యేక సందర్భాలలో 2400 ఆర్టీసీ బస్సుల సేవలు

విద్య

35 విద్యా సంస్థలలో దాదాపు 20 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

దేశవ్యాప్తంగా 61 దేవాలయాలు ఉన్నాయి

04 గోసంరక్షణ శాలలు

వేద మరియు వారసత్వ సంరక్షణతో సహా 08 ట్రస్టులు ఉన్నాయి

7000 మంది రెగ్యులర్ ఉద్యోగులు భక్తులకు సేవలు అందిస్తున్నారు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, శ్రీవారి సేవ వాలంటీర్లు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సేవలు అందిస్తున్నారు

సామాజిక కార్యకలాపాలు

కుష్ఠురోగులకు ఎస్వీ పేదల గృహం, వృద్ధులు, నిరాదరణకు గురైన వారికి కరుణాధామం, అనాధలకు విద్య , వసతి, భోజనంతో ఎస్వీ బాలమందిరం-, చెవిటి మరియు మూగ పాఠశాల, ప్రత్యేక సామర్థ్యం ఉన్న విద్యార్థుల కోసం పాలిటెక్నిక్ కళాశాల

టిటిడి అన్ని సేవలను డిజిటలైజేషన్ ద్వారా ముందుకు సాగుతోందని, రాబోయే రెండు మూడు సంవత్సరాలలో మరింతగా డిజిటలైజేషన్ ను వినియోగించి సేవలు అందిస్తామన్నారు. భక్తులకు పారదర్శక సౌకర్యాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఐటీ కార్యకలాపాలను జోడించి 100% సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ముగించారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది