TTD JEO INSPECTS BHUBANESWAR TEMPLE _ భువ‌నేశ్వ‌ర్‌లో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణ ప‌నులను ప‌రిశీలించిన జెఈవో

Tirupati, 06 April 2022:  TTD JEO Sri Veerabrahmam on Wednesday inspected the ongoing construction works at Sri Venkateswara Temple, Bhubaneswar in Odisha.

He directed the engineering officials to complete all works on schedule and that the date of the Maha Samprokshana fete will be decided after consulting the Agama advisors.

Among others, he directed officials in make arrangements for the provision of drinking water, parking, accommodation, security with CC cameras and vigilance, Shanku &Chakra icons at elevated location and sourcing flower needs and finally repairs to Kalyana Mandapam.

 

JEO also met the local Srivari Sevakulu and interacted with team leaders of Srivari Sevakulu from Berhampur, Bhubaneswar and Cuttack and lauded their contribution to thousands of devotees visiting Tirumala and Tirupati every day.

He asked them to continue their good service at their home turf during the Maha Samprokshana likely to take place in Sri Venkateswara temple coming up at Bhubaneswar soon. He also lauded the impeccable services of Srivari Sevakulu during the opening of the Srivari temple at Visakhapatnam.

TTD Chief Engineer Sri Nageswara Rao, Agama Advisor, Sri Vedanta Vishnu Bhattacharyulu, SE (Electrical) Sri Venkateswarlu, SE-3 Sri Satyanarayana, VGO Sri Manohar, DyEO Dr Ramana Prasad were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భువ‌నేశ్వ‌ర్‌లో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణ ప‌నులను ప‌రిశీలించిన జెఈవో

తిరుపతి, 2022 ఏప్రిల్ 06: ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌లో జ‌రుగుతున్న శ్రీ‌వారి ఆల‌య నిర్మాణ ప‌నుల‌ను బుధ‌వారం టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ప‌రిశీలించారు.

ఆల‌య నిర్మాణ ప‌నులు పూర్తి కావ‌చ్చాయ‌ని, మిగిలి ఉన్న ప‌నుల‌ను నిర్దేశిత వ్య‌వ‌ధిలో పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారులను జెఈవో ఆదేశించారు. ఆగ‌మ స‌ల‌హాదారుల సూచ‌న‌ల మేర‌కు మ‌హాసంప్రోక్ష‌ణ తేదీని నిర్ణ‌యించి ఖ‌రారు చేస్తామ‌న్నారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం ఆల‌యంలో తాగునీరు, పార్కింగ్ త‌దిత‌ర వ‌స‌తులు క‌ల్పించాల‌ని ఆదేశించారు. ఆల‌య భ‌ద్ర‌త కోసం సిసిటివిలు, భ‌ద్ర‌తా సిబ్బందిని ఏర్పాటు చేయాల‌ని సూచించారు. భువ‌నేశ్వ‌ర్‌లో ఎక్కువ‌మందికి క‌నిపించేలా ఎత్తు ప్ర‌దేశంలో శ్రీ‌వారి శంఖుచ‌క్ర‌నామాలు ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను కోరారు. ఆల‌య కైంక‌ర్యాల కోసం స్థానికంగా పుష్పాల‌ను స‌మ‌కూర్చుకోవాల‌న్నారు. అనంత‌రం ఆల‌యం ప‌క్క‌న గ‌ల క‌ల్యాణ‌మండ‌పంలో జ‌రుగుతున్న మ‌ర‌మ్మ‌తుల‌ను జెఈవో ప‌రిశీలించారు. ఈ పనులను వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

శ్రీ‌వారి సేవ‌కుల‌తో జెఈవో స‌మావేశం

అనంత‌రం ఒడిశా రాష్ట్రంలోని భువ‌నేశ్వ‌ర్‌, బ‌రంపూర్‌, క‌ట‌క్ త‌దిత‌ర ప్రాంతాల నుండి వ‌చ్చిన శ్రీ‌వారి సేవ‌కుల టీమ్ లీడ‌ర్ల‌తో జెఈవో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లో ప్ర‌తినిత్యం వేలాది మంది భ‌క్తుల‌కు శ్రీ‌వారి సేవ‌కులు సేవ‌లందిస్తున్నార‌ని, ఇత‌ర ప్రాంతాల్లోనూ వారు అందిస్తున్న సేవ‌లు శ్లాఘ‌నీయ‌మ‌ని కొనియాడారు. గ‌త నెల‌లో వైజాగ్‌లో జ‌రిగిన శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి సేవ‌కులు చ‌క్క‌టి సేవ‌లు అందించార‌ని, ఇంకా కొన‌సాగిస్తున్నార‌ని చెప్పారు. భువ‌నేశ్వ‌ర్‌లో త్వ‌ర‌లో ప్రారంభం కానున్న శ్రీ‌వారి ఆల‌యంలో శ్రీ‌వారి సేవ‌కులు స్వ‌చ్ఛందంగా సేవ‌లందించాల‌ని పిలుపునిచ్చారు.

జెఈవో వెంట టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్) శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, ఎస్ఇ-3 శ్రీ స‌త్య‌నారాయ‌ణ, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, డెప్యూటీ ఈవో డా.ర‌మ‌ణ‌ప్ర‌సాద్ త‌దిత‌రులు ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.