TTD PLANS MASSIVE PROGRAM WITH OVER 230 EXPONENT DIVYA PRABANDHA PARAYANADARS ON FEB 9 _ ఫిబ్ర‌వ‌రి 9న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌లో 200 మందికిపైగా పండితుల పారాయ‌ణం

DRAVIDA VEDAM- NALAYAR DIVYA PRABANDAM

Tirumala, 8 Feb. 20: The fourth edition of Nalayar Divya Prabandam Parayanam will be conducted on Sunday on the auspicious Pournami day on February 9. Over 230 Nalayira Divya Prabandha Parayanadars will recite Prabandha Ghosti in front of Garuda Vahanam on Sunday evening.

According to Acharya Rajagopalan, Secretary of HDPP and Special Officer of TTDs Alwar Divya Prabandam Project, the Nalayira Divya Prabandam is also popular as “Dravida Vedam” comprising of 4000 pasuras composed by 12 Alwars (Vaishnavite seers) in the Eighth century. The Parayanam of this Prabandam is still practiced in Srirangam and other Vaishnavite temples across the country.

TTD launched the Nalayar Divya Prabandam Project in 2010 to preserve the ancient Dravida Veda and from 2016 onwards, the holy Parayana Mahotsavam is being observed at Tirumala.

In the fourth edition of Nalayara Divya Prabanda Parayana Mahotsavam on Sunday, nearly 230 parayanadars from various Vaishnava Divya Desams will present Prabandha Parayanam thrice on Sunday, in the morning and evening at Asthana Mandapam and also in front of Garuda Vahanam seva between 7pm and 9pm in the presence of HH Sri Sri Sri Pedda Jiyar Swamy and HH Sri Chinna Jiyar Swamy of Tirumala.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

ద్ర‌విడ వేదం నాలాయిర దివ్య‌ప్ర‌బంధం

ఫిబ్ర‌వ‌రి 9న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌లో 200 మందికిపైగా పండితుల పారాయ‌ణం

ఫిబ్రవరి 08, తిరుమల 2020: దక్షిణభారతంలో ముఖ్యంగా తమిళనాడులో దివ్య ప్రబంధాన్నివేదాలతో సమంగా పరిగణిస్తారు. అందుకే దీనిని ద్రవిడ వేదం అన్నారు. శ్రీరంగం త‌దిత‌ర ఆలయాల్లో ప్రతినిత్యం విధిగా ఈ దివ్య ప్రబంధాన్నిఉచ్చరించడం భగవత్సేవలో ఒక ముఖ్యమైన భాగం. 8వ శతాబ్దానికి ముందు 12 మంది ఆళ్వారులు రచించిన 4 వేల‌ పాశురాల సమాహారం నాలాయిర దివ్య ప్రబంధం. తమిళంలో నాలాయిరం అనగా నాలుగు వేలు. శ్రీ‌మ‌హావిష్ణువును, వారి అనంత రూపాలను కీర్తించే ఈ దివ్య ప్రబంధాన్ని ఆళ్వార్లు ప‌లు ఆలయాల్లో గానం చేశారని, అలా గానం చేసిన ప్రాంతాలను దివ్యదేశాలంటార‌ని టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్ తెలిపారు.

ఈ దివ్య‌ప్ర‌బంధానికి విస్తృత ప్ర‌చారం క‌ల్పించేందుకు టిటిడి 2010వ సంవ‌త్స‌రంలో నాలాయిర దివ్య‌ప్ర‌బంధ పారాయ‌ణ ప‌థ‌కాన్ని ప్రారంభించింది. ఈ ప‌థ‌కంలో ప్ర‌స్తుతం 230 మంది పండితులు దేశ‌వ్యాప్తంగా ప‌లు వైష్ణ‌వాల‌యాల్లో దివ్య‌ప్ర‌బంధాన్ని పారాయ‌ణం చేస్తున్నారు. 2016వ సంవ‌త్స‌రంలో అప్ప‌టి ఈవో డా. డి.సాంబ‌శివ‌రావు ఆదేశాల మేర‌కు ఈ పండితులంద‌రినీ తిరుమ‌ల‌కు ఆహ్వానించి పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌లో సామూహికంగా ప్ర‌బంధ పారాయ‌ణం చేయించారు. ఇప్ప‌టివ‌ర‌కు మూడుసార్లు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

నాలుగో సారి దివ్య‌ప్ర‌బంధ మ‌హోత్స‌వం

శ్రీ‌వారి 4వ నాలాయిర దివ్యప్రబంధ మహోత్సవం ఆదివారం పౌర్ణమి గరుడసేవలో వైభవంగా జరుగనుంది. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో నాలాయిర దివ్యప్రబంధ పారాయణ పథకంలోని దాదాపు 200 మంది పారాయణదారులు స్వామివారి వాహనం ఎదుట పాశురాలను పారాయణం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పారాయణదారులు విచ్చేయనున్నారు.

ముందుగా ఉదయం 10 గంటలకు తిరుమలలోని ఆస్థానమండపంలో నాలాయిర దివ్యప్రబంధ పారాయణదారులతో సమావేశం, దివ్య‌ప్ర‌బంధ పారాయ‌ణం నిర్వహిస్తారు. టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి విచ్చేసి తమ సందేశాలిస్తారు. అనంతరం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు దివ్యప్రబంధ గోష్ఠిగానం నిర్వహిస్తారు. ఆ త‌రువాత రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో జరుగనున్న శ్రీవారి పౌర్ణమి గరుడసేవలో జీయ‌ర్‌స్వాముల వెంట పండితులు దివ్యప్రబంధ పారాయణం చేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.