TTD PLANS PANCHAGAVYA PRODUCTS SALE VIA THE E-COMMERCE PLATFORM _ఈ – కామ‌ర్స్ ద్వారా పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల విక్ర‌యం – జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

Tirupati, 20 April 2022: TTD JEO Sri Veerabrahmam said on Wednesday that all 15 Panchagavya products, Agarbattis, and dry flower goods produced by TTD will soon be sold on the e-Commerce platform to give larger access to devotees.

Addressing officials at his chambers in TTD Administrative Building on Wednesday evening, the TTD JEO said in view of the huge response to Agarbattis its capacity is being increased from 15,000 packets to 30,000 packets now.

He invited suggestions for popularising the Panchagavya and other dry flower technology products and also directed officials to take up publicity campaigns. He said the TTD products were already on sale at TTD information centers in Bangalore, Chennai, Vizag, and Hyderabad and soon will be available at Delhi and Bhubaneswar centers.

After deploying e-Commerce platforms these TTD information center’s across the country will be utilized as stock points.

TTD IT Advisor Sri Amar Nagaram suggested that akin to Srivari laddu, the other products shall be placed on the e-Commerce platform and would be soon popularised with publicity on digital media. He said the offline sale points would be linked to banks on PoS platforms.

Additional FA&CAO Sri Ravi Prasadudu and CIO Sri Sandeep took part while the Jio representatives participated virtually.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఈ – కామ‌ర్స్ ద్వారా పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల విక్ర‌యం – జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

తిరుపతి, 2022 ఏప్రిల్ 20 ; టిటిడి త‌యారు చేస్తున్న 15 ర‌కాల పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల‌తో పాటు, ఆల‌యాల్లో ఉప‌యోగించిన పుష్పాల‌తో త‌యారు చేస్తున్న అగ‌ర‌బ‌త్తీలు, ఫోటో ఫ్రేమ్ త‌దిత‌ర ఉత్ప‌త్తుల‌ను ఈ – కామ‌ర్స్ ప్లాట్ ఫాంల ద్వారా ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేయ‌డానికి స‌హ‌క‌రించాల‌ని జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం కోరారు. టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని త‌న ఛాంబ‌ర్‌లో అధికారులు, జియో ప్లాట్ ఫాం ప్ర‌తినిధులతో బుధ‌వారం స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి అగ‌ర‌బ‌త్తీల‌కు భ‌క్తుల నుండి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని దీనివ‌ల్ల ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని 15 వేల నుండి 30 వేల ప్యాకెట్ల‌కు పెంచ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. పంచ‌గ‌వ్య, ఫోటో ఫ్రేమ్ త‌దిత‌ర ఉత్ప‌త్తుల‌కు ఈ త‌ర‌హా ఆద‌ర‌ణ ల‌భించేలా చేయ‌డానికి త‌గిన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వాల‌ని కోరారు. ఇందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌చార ప్ర‌ణాళిక‌లు కూడా సూచించాల‌న్నారు. బెంగుళూరు, చెన్నై, వైజాగ్‌, హైద‌రాబాద్ స‌మాచార కేంద్రాల్లో ఈ ఉత్ప‌త్తుల విక్ర‌యాలు జ‌రుగుతున్నాయ‌ని, త్వ‌ర‌లో ఢిల్లీ, భువ‌నేశ్వ‌ర్‌లోని స‌మాచార కేంద్రాల్లో విక్ర‌యాలు ప్రారంభిస్తామ‌న్నారు. ఈ కామ‌ర్స్‌లో విక్ర‌యాల కోసం అవ‌స‌ర‌మైతే స‌మాచార కేంద్రాల‌ను స్టాక్ పాయింట్లుగా కూడా ఉప‌యోగిస్తామ‌న్నారు.

తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదంలాగే పంచ‌గ‌వ్య, అగ‌ర‌బ‌త్తీలు, ఫోటో ఫ్రేమ్ త‌దిత‌ర ఉత్ప‌త్తులు కూడా స్వామివారి ప్ర‌సాదాలు గానే భ‌క్తులు భావించేలా చేయ‌డం ద్వారా ఈ – కామ‌ర్స్‌లో వీటిని భ‌క్తుల‌కు మ‌రింత చేరువ చేయ‌వ‌చ్చ‌ని టిటిడి ఐటి స‌ల‌హాదారు శ్రీ అమ‌ర్ సూచించారు. ఇందుకోసం డిజిట‌ల్ మీడియాలో ప్ర‌చారానికి స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పారు. అలాగే టిటిడి అఫ్‌లైన్ ద్వారా జ‌రుపుతున్న విక్ర‌యాల‌కు బ్యాంకుల‌ను అనుసంధానం చేసే పివోఎస్ విధానాన్ని త‌యారు చేసి ఇస్తామ‌న్నారు.

అద‌న‌పు ఎఫ్ఎసిఏవో శ్రీ ర‌విప్ర‌సాద్‌, సిఐవో శ్రీ సందీప్ పాల్గొన‌గా జియో ప్లాట్ ఫాం ప్ర‌తినిధులు వ‌ర్చువ‌ల్‌గా హాజ‌ర‌య్యారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.