TTD SIGNS TWO MoUs WITH SV VETERINARY UNIVERSITY FOR ANIMAL FODDER AND ARTIFICIAL REPRODUCTION AT SV GOSHALA _ టిటిడి గోశాల‌ల్లో పిండ మార్పిడి, ప‌శుదాణా త‌యారీకి ఎస్వీ ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యంతో ఎంఓయు

– SWADESHI COW GHEE FOR SRIVARI KAINKARYAS- TTD CHAIRMAN SRI YV SUBBA REDDY

 Tirumala, 11 Aug. 21: TTD chairman Sri YV Subba Reddy said that two significant MoU’s were inked on Wednesday between SV Goshala and SV Veterinary University.

The MoU’s are aimed at promoting the desi breed of cows through the latest ART procedures, to produce Ghee from Swadeshi Cows and Cow based products at the SV Goshala for Srivari daily Naivedyam.

Dr Harnath Reddy, Director of SV Goshala and University Registrar Dr Ravi exchanged the MOU’s at the Annamaiah Bhavan in presence of TTD EO Dr KS Jawahar Reddy and AP Veterinary University Vice-Chancellor Dr Padnanabha Reddy.

FOLLOWING ARE THE HIGHLIGHTS OF BOTH MOU’s

MOU- 1

The MOU aims coordination between University and the SV Gosamrakshana Trust for the reproduction technologies developed by the university: In-Vito and In-Vitro process for high yield cows and also ART (artificial reproduction Technology).

The university will facilitate the Goshala with embryo transfer technology (ETT) cum In-Vitro fertilization (IVF) labs at the College of Veterinary Sciences at Tirupati and provide training to UG and PG students.

MOU-2

According to the second MOU, the university will promote cattle feed production plant, besides training students and research, under the supervision of the Head of Animal Nutrition of University and Registrar. TTD will set up a lab for quality control of raw material, composite feed and simplification of the process. The university will provide technical know-how on high yield desk cows and genetically treatment of high yield cows.

Both agree to promote a high yield of desk cows through ART technology besides the use of ART for promoting a new breed of cows and also management and production improvements in Goshala.

Speaking on the occasion TTD chairman said 60 litres of ghee were used in the Srivari temple every day for Swami kainkaryas & deeparadhana. The veterinary university shall produce technical know-how to make the ghee needed in the temple through swadeshi cows.

TTD has also signed an agreement with the university for Embryo transfer, quality Cattle feed production with which the doctors of the university shall examine the cows at the Go Samrakshana for high yield and embryo transfer procedures.

The collaboration is also aimed at breeding high yield cows genetically from the Cows available at the Palamneru Goshala.

Similarly in another agreement for quality cattle feed production TTD will collaborate with AP Veterinary University and the Newtech   Bio-sciences Ltd of New York-based technocrat, Pratap Reddy, to produce composite cattle feed at Tirupati Goshala premises.

Prominent among those who participated in the event were Deputy CM Sri K Narayanaswamy, MP Dr Gurumoorthy, MLAs Sri Bhumana Karunakar Reddy, Sri Chevireddy Bhaskar Reddy, Sri B Madhusudhan Reddy, Sri A Srinivasulu, Sri Prasada Raj, Sri Dorababu, MLC Sri Janga Krishnamurthy, Additional EO Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, and Dr Sarjan Rao. Dr Venkata Naidu, Dr Brahmaiah, and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి గోశాల‌ల్లో పిండ మార్పిడి, ప‌శుదాణా త‌యారీకి ఎస్వీ ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యంతో ఎంఓయు

స్వ‌దేశీ ఆవు పాల‌ నుండి శ్రీ‌వారి కైంక‌ర్యాల‌కు అవ‌స‌ర‌మైన నెయ్యి : టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

తిరుమ‌ల‌, 2021 ఆగ‌స్టు 11: స్వ‌దేశీ ఆవు పాల నుండి శ్రీ‌వారి కైంక‌ర్యాలకు అవ‌స‌ర‌మైన నెయ్యి త‌యారు చేయ‌డానికి, దేశ‌వాళి గో జాతుల అభివృద్ధికి, ఇటీవ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ప్రారంభించిన గో ఆధారిత నైవేధ్యం కొర‌కు టిటిడి గోశాల‌, ఎస్వీ ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యంతో ఎంఓయు కుదుర్చుకున్న‌ట్లు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో బుధ‌వారం ఉద‌యం టిటిడి ఛైర్మ‌న్, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి డాక్ట‌ర్ ప‌ద్మ‌నాభ‌రెడ్డి స‌మ‌క్షంలో గో శాల డైరెక్ట‌ర్ శ్రీ హ‌ర‌నాథ రెడ్డి, ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యం రిజిస్టార్ డా.ర‌వి ఎంఓయు ప‌త్రాల‌ను మార్చుకున్నారు.

ఇందులోని ముఖ్యాంశాలు –

ఎంఓయు – 1

ఎస్‌వి గోసంరక్షణ ట్రస్ట్, టిటిడి మరియు శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం సహాయక పునరుత్పత్తి టెక్నాలజీల ద్వారా ఇన్-వివో మరియు ఇన్-విట్రో పద్ధతుల ద్వారా పశువుల ఉత్పాదకత మరియు పిండాల ఉత్పత్తిని పెంచడానికి ప్రాజెక్ట్ ఏర్పాటుకు సహకరించడానికి ఒప్పందానికి అంగీకరించాయి. (ART) ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ టెక్నాలజీ (ETT) కమ్ ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ప్రయోగశాలను కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతిలో ఏర్పాటు చేయడం ద్వారా. UG మరియు PG విద్యార్థులకు శిక్షణ అందించడానికి మరియు ART లో పరిశోధనను ప్రోత్సహించడం ఈ ఒప్పందం లక్ష్యం.

ఎస్‌వి గోసంరక్షణ ట్రస్ట్, టిటిడి మరియు పశువైద్య విశ్వవిద్యాలయం అన్ని సౌకర్యాలతో తిరుపతిలోని కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్‌లో ETT కమ్ IVF ప్రయోగశాలను ఏర్పాటు చేయడం ద్వారా ART ద్వారా పశువుల ఉత్పాదకతను పెంచడం మరియు పిండాల ఉత్పత్తిని ఇన్-వివో మరియు ఇన్విట్రో పద్ధతుల ద్వారా సమన్వయం చేసుకోవడానికి అంగీకారం జరిగింది. ఆవు సంక్షేమం, ఆరోగ్యం సంతానోత్పత్తి, పిండాల ఉత్పత్తి మరియు పశువైద్య విశ్వవిద్యాలయం నుండి మెరుగైన పశువుల నిర్వహణ సలహా ద్వారా ఉత్పత్తిని , మెరుగుపరచడం ఈ ఎంఓయు లక్ష్యం.

ఎంఓయు – 2

ఎస్‌వి గోసంరక్షణ శాలలో పశువుల దాణా తయారీ ప్లాంట్ ఏర్పాటు. తద్వారా ఆవులకు శాస్త్రీయ దాణా తయారీ. ఫీడ్ ప్లాంట్‌లో విద్యార్థులకు శిక్షణ మరియు పరిశోధన కార్యకలాపాలను నిర్వహించడం. పశువైద్య విశ్వవిద్యాలయం ఫీడ్ మిల్లు నిర్వహణ బాధ్యత తీసుకుంటుంది. జంతు పోషకాహార విభాగం అధిపతి, రిజిస్ట్రార్ పర్యవేక్షణలో జరుగుతుంది. నాణ్యత పర్యవేక్షణను సులభతరం చేయడానికి, ఫీడ్ పదార్థాలు, ముడి పదార్థాలు మరియు కాంపౌండ్ ఫీడ్‌ల నాణ్యత నియంత్రణ కోసం టీటీడీ ల్యాబ్ సౌకర్యాలను కల్పిస్తుంది. అధిక దిగుబడినిచ్చే ఆవులు, గర్భిణీ పాడి ఆవులు మరియు జన్యుపరంగా ఉన్నతమైన ఆవులకు ఆహారం ఇవ్వడానికి TMR పై పశువైద్య విశ్వవిద్యాలయం సాంకేతిక సహాయం అంది స్తుంది.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ శ్రీ‌వారి ఆల‌యంలో ప్ర‌తి రోజు 60 లీట‌ర్ల నెయ్యి అవ‌స‌రం అవుతుంద‌ని, ఇందులో 30 లీట‌ర్లు స్వామివారి కైంక‌ర్యాల‌కు, 30 లీట‌ర్లు దీపారాధ‌న‌కు వినియోగిస్తార‌న్నారు. ఇందుకోసం స్వ‌దేశీ ఆవు పాల నుండి నెయ్యి త‌యారు చేయ‌డానికి ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యం త‌గిన సాంకేతిక స‌హ‌కారం అందిస్తుంద‌ని చెప్పారు. పిండ మార్పిడి ప‌థంకం (Embryo transfer), ప‌శుదాణా త‌యారీ (Cattle feed)కి ఎస్వీ ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యంతో ఎంఓయు కుదుర్చుకున‌ట్లు తెలిపారు. ఎంఓయు ద్వారా ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యం డాక్ట‌ర్లు గో సంర‌క్ష‌ణ‌శాల‌లోని ఆవుల‌న్నింటినీ ప‌రీక్షించి వాటిలో పిండోత్ప‌త్తికి, అధిక పాల ఉత్ప‌త్తికి త‌గిన వైద్యం అందిస్తార‌న్నారు.

తిరుప‌తి, ప‌ల‌మ‌నేరుల్లోని గోవుల‌కు జ‌న్యుప‌రంగా (High gentic merit) ఉన్న‌త‌ ల‌క్ష‌ణాలు ఉన్న ఆవు దూడ‌ల‌ను పుట్టించి, పాల ఉత్ప‌త్తి పెంచే ఏర్పాట్లు చేస్తార‌న్నారు. అదేవిధంగా ప‌శువుల దాణ (Cattle feed) త‌యారీకి ఎస్వీ ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యం మ‌రియు అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ప్ర‌తాప్ రెడ్డి సాంకేతిక స‌హ‌కారంతో న్యూటెక్ బ‌యో సైన్సెస్ ఇండియా లిమిటెడ్‌వారితో సంయుక్తంగా టిటిడి ఎంఓయు కుదుర్చుకున్న‌ద‌న్నారు. తిరుప‌తి గోశాల ప్రాంగ‌ణంలో నాణ్య‌మైన ఉన్న‌త ప్ర‌మాణాలు క‌లిగిన స‌మీకృత ప‌శువుల దాణాను త‌యారు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు.

ఉప ముఖ్యమంత్రి శ్రీ కె నారాయణ స్వామి, ఎంపి డాక్టర్ గురుమూర్తి, శాసన సభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీ ఎ. శ్రీనివాసులు, శ్రీ ప్రసాదరాజు, శ్రీ దొరబాబు, ఎమ్మెల్సీ శ్రీ జంగా క్రిష్ణ‌మూర్తి, అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, డా.స‌ర్జ‌న్ రావు, డా.వెంక‌ట‌నాయుడు, డా.బ్ర‌హ్మ‌య్య ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.