TTD SPIRITUAL PROGRAMS IN VAISHAKA MONTH _ వైశాఖ మాసంలో విశేష పూజా కార్యక్రమాలు
Tirumala, 1 May 2021: in continuation of its saga of spiritual programs for the welfare of humanity, TTD has lined up several happenings in the month of Vaisakha month.
It is well known that the spiritual and devotional programs conducted by TTD during Karthika, Dhanur, Magha, Phalguna and Chaitra months were popular among devotees across the world and were live telecast by the SVBC.
Following is the schedule of events in the Vaishakha month.
– May 14: Sri Lakshmi Narayana puja in the morning at Yagashala of SV Vedic University in Tirupati on the occasion of Akshaya Tritiya.
– May 17: Sri Jagadguru Shankaracharya puja in the morning at Yagashala of SV Vedic University in Tirupati on Shankara Jayanti in the morning.
– May 25: Sri Narasimha Jayanti celebrations at Srivari temple, Tirumala in the morning.
– June 4: Hanuman Jayanti pujas at Tirumala in the morning.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైశాఖ మాసంలో విశేష పూజా కార్యక్రమాలు
తిరుమల, 2021 మే 01: లోక కల్యాణార్థం వైశాఖ మాసంలో పలు విశేష పూజా కార్యక్రమాలను టిటిడి నిర్వహించనుంది. ఇప్పటికే నిర్వహించిన కార్తీక, ధనుర్, మాఘ, ఫాల్గుణ, చైత్ర మాస ఉత్సవాలకు భక్తుల నుండి విశేషాదరణ లభించింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
– మే 14న అక్షయతృతీయ సందర్భంగా తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం యాగశాలలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు లక్ష్మీనారాయణ పూజ జరుగనుంది.
– మే 17న శ్రీ శంకర జయంతి సందర్భంగా తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం యాగశాలలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు జగద్గురు శంకరాచార్య పూజ నిర్వహిస్తారు.
– మే 25న నృసింహ జయంతి సందర్భంగా తిరుమలలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు టిటిడి అర్చకులు నృసింహస్వామి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.
– జూన్ 4న హనుమజ్జయంతి సందర్భంగా తిరుమలలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు టిటిడి అర్చకులు శ్రీ హనుమత్ పూజ చేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.