TTD TO COMMENCE “GUDIKO GOMATA” AS A PILOT PROJECT _ పైలెట్ ప్రాజెక్టుగా గుడికో గోమాత

Tirumala, 24 Sep. 20: The Executive Committee meeting of Hindu Dharma Prachara Parishad (HDPP) was held under the Chairmanship of Sri YV Subba Reddy along with TTD EO Sri Anil Kumar Singhal and other committee members at Annamaiah Bhavan in Tirumala on Thursday evening.

The Committee has decided initially to provide one Cow to 28 temples located in AP, TS and Karnataka as a pilot project. This includes all 13 districts of AP, 10 districts in (old) Telengana State and five temples in Karnataka.

This programme wi be executed by SV Dairy Farm and the donors have to donate Indigenous cows to these temples through prior consultation from SV Dairy Farm Director only

Once the Cow is donated, the concerned temples have to place a board titled as “Gudiko Gomata-TTD”. Through this unique Desi Cow protection and promotion programme, TTD will provide cows to mutts, vedic schools, hereditary institutions, temples under purview of Endowments department etc.and the maintenance of the bovine should be taken care by the concerned institutions only.

The information, application amd donation procedure pertaining to this programme shall be procured from SV Dairy Farm Director.

Executive Committee members Sri Siva Kumar, Sri Govinda Hari, Sri DP Ananta, Sri Subba Rao(through Video Conference), JEO Sri P Basanth Kumar, HDPP Secretary Sri Rajagopalan, Dairy Farm Director Dr Harinath Reddy were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పైలెట్ ప్రాజెక్టుగా గుడికో  గోమాత

హెచ్‌డిపిపి కార్య‌నిర్వాహ‌క మండ‌లి స‌మావేశం తీర్మానం

తిరుమల, 2020 సెప్టెంబరు 24: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని 28 దేవాల‌యాల్లో గుడికో  గోమాత  కార్య‌క్ర‌మాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌తో క‌లిసి గురువారం సాయంత్రం అన్న‌మ‌య్య భ‌వ‌నంలో హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌నిర్వాహ‌క మండ‌లి స‌మావేశం నిర్వ‌హించారు.
 
ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తీర్మానించింది. హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్, ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని అమ‌లుచేయ‌నున్నారు. తెలంగాణ‌లోని పాత 10 జిల్లాలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 13 జిల్లాల్లో  జిల్లాకు ఒక ఆల‌యం చొప్పున‌, క‌ర్ణాట‌క రాష్ట్రంలోని 5 దేవాల‌యాల్లో క‌లిపి మొత్తం 28 ఆల‌యాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా ఈ కార్య‌క్ర‌మం ప్రారంభించ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నారు. టిటిడి ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల ద్వారా దేశ‌వాళీ ఆవుల దానాన్ని స్వీక‌రించాల‌ని తీర్మానించారు. మ‌ఠాలు, పీఠాలు, వంశ‌పారంప‌ర్య ప‌ర్య‌వేక్ష‌ణ ఆల‌యాలు, దేవాదాయ శాఖ ప‌రిధిలోని ఆల‌యాలు, వేద పాఠ‌శాలల‌కు ఈ కార్య‌క్ర‌మం ద్వారా గోవును టిటిడి అంద‌జేస్తుంది. గోదానం పొందిన సంబంధిత ఆల‌యాలు, పీఠాలు, వేద‌పాఠ‌శాల‌లు గోవుల సంర‌క్ష‌ణ బాధ్య‌త తీసుకోవాల్సి ఉంటుంది.

టిటిడి ద్వారా దానం పొందిన గోవుల వ‌ద్ద గుడికో గోమాత – టిటిడి అనే బోర్డు త‌ప్ప‌నిస‌రిగా ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల ముంద‌స్తు అనుమ‌తితోనే భ‌క్తులు ఈ కార్య‌క్ర‌మానికి గోవుల‌ను దానం చేయాల్సి ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన విధి విధానాలు, గోదానం, ద‌ర‌ఖాస్తుల వివ‌రాలు ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల డైరెక్ట‌ర్ నుంచి పొంద‌వ‌చ్చు.

ఈ స‌మావేశంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ శివ‌కుమార్‌, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ డిపి.అనంత‌, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, ఎస్వీ గోసంర‌క్ష‌ణశాల డైరెక్ట‌ర్ డా. హ‌ర‌నాథ‌రెడ్డి పాల్గొన్నారు. హెచ్‌డిపిపి కో-అప్ష‌న్ స‌భ్యులు శ్రీ బొమ్మ‌దేవ‌ర సుబ్బారావు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశంలో పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.