TTD TO COMMENCE SRI VENKATESWARA DIVYANUGRAHA VISESHA HOMAM SOON IN SAPTHAGIRI GO PRADAKSHINA MANDIRAM_ కార్తీక మాసంలో అలిపిరి సప్తగోప్రదక్షిణ మండపమందు శ్రీ వేంకటేశ్వర దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభం
EO REVIEWS ON THE MODALITIES
TIRUMALA, 21 OCTOBER 2023: TTD is all set to commence Sri Venkateswara Divyanugraha Visesha Homam likely in the sacred month of Karthika in November in the Sapthagiri Gopradakshina Mandiram located in Alipiri. In connection with this, TTD EO Sri AV Dharma Reddy along with the officials held an elaborated review meeting to discuss the modalities at Annamaiah Bhavan in Tirumala on Saturday.
The EO said the chief aim behind the introduction of this Homam is that it has a great place in Vedic Dharma and Upanishads and the Grihastas when participating in this Homam will beget the benign blessings of Sri Venkateswara Swamy and lead a peaceful and prosperous life.
The EO instructed the engineering officials to come to lay a temporary structure initially to perform the Homam on Go Mandiram premises. He also discussed the quota of tickets to be released on-line and offline. The daily activity of the Homam will be supervised under the control of the Deputy EO of Sri Govindaraja Swamy Group of Temples.
The Vice-chancellor of the TTD-run Sri Venkateswara Vedic University Acharya Rani Sada Siva Murty suggested that the design of the program which will have Bhakta Sankalpam, recitation of 108 divine mantras from Sri Paramatmika Upanishad, Vishwak Sena Puja, Punyahavachanam, Ankurarpanam, Raksha Bandhanam, Agni Pratisthapanam, Kumbharchanas, Visesha Paramatmika Mula Mantra Homam, Kumbha Samarpanam, Naivedyam, Neerajanam, Asheervadam, Homa Prasada Vitaranam etc. The participating Grihasta pilgrims (Husband and Wife) shall take part in the traditional dress only in the Homam.
One of the chief priests of Tirumala temple Sri Venugopala Deekshitulu, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shamukh Kumar, CE Sri Nageswara Rao, SV Gosala Director Dr Harnath Reddy and other officials were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కార్తీక మాసంలో అలిపిరి సప్తగోప్రదక్షిణ మండపమందు
శ్రీ వేంకటేశ్వర దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభం
– టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2023 అక్టోబరు 21: తిరుపతి అలిపిరి నందు గల సప్తగోప్రదక్షిణ మండపమందు కార్తీక మాసం(నవంబరు)లో శ్రీ వేంకటేశ్వర దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభించనున్నట్లు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టీటీడీ ఆధ్వర్యంలో సప్తగోప్రదక్షిణ మండపమందు ప్రతినిత్యం శ్రీ వేంకటేశ్వర దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో వైఖానస శాస్త్రానుసారమే శ్రీ వేంకటేశ్వర దివ్యానుగ్రహవిశేష హోమం నిర్వహింపబడుతుందని చెప్పారు. ఈ హోమమందు శ్రీవారి పరిపూర్ణ తత్వాన్ని ఆవిష్కరించే ఉపనిషత్తులు అయిన శ్రీపారమాత్మిక ఉపనిషత్తు నందు గల 108 మూల మంత్రాలతో హోమం జరుగుతుందన్నారు. ఈ పారమాత్మిక ఉపనిషత్తు వేద మంత్రములలోకెల్లా అత్యంత ఉత్కృష్టమైన ఉపనిషత్తుగా చెప్పబడినదన్నారు.
అనంతరం ఎస్వీ వేద విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ, ఈ విశేష హోమంలో భాగంగా ప్రతి రోజు భక్త సంకల్పం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, సద్యోన్కురార్పణము, రక్షాబంధనము, అగ్ని ప్రతిష్టాపనము, కుంభార్చనలు విశేష పారమాత్మిక మూలమంత్ర హోమము, పూర్ణాహుతి, కుంభ సమర్పణము, నైవేద్యము, నీరాజనం, భక్తులకు ఆశీర్వచనం, హోమ ప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో పాల్గొనే గృహస్తులు ధోవతి, ఉత్తరీయం, చీర ధరించి హోమంలో పాల్గొనాలన్నారు.
శ్రీవారిని ఆరాధించు పద్ధతులలో అతి ముఖ్యమైనది హోమం, శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రధానంగా హోమం నిర్వహిస్తారని చెప్పారు. ఈ హోమంలో ద్రవ్య త్యాగము వలన మానవునికి ఇలోకమందు ధన ధాన్య భోగభాగ్యాలు, పరిపూర్ణమైన ఆయురారోగ్యాలు, సమస్త శుభాలు, నవగ్రహ దోషాలు, వివిధ ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని తెలిపారు. కావున భక్తులు హోమం నందు పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందాలన్నారు.
హోమం పూర్తి అయిన తరువాత హోమ శక్తిని కుంభమునందు సమారోపన గావించి ఆ కుంభ జలము, హోమ భస్మం హోమంలో పాల్గొన్న గృహస్థులకు అందిస్తారన్నారు.
ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.